Breaking News

కూలీ నెం 1 చిత్రానికి రూ.50 కోట్లు వసూలు చేసిన ధావన్ ఫామిలీ

13 th Jan 2021, UTC

సుయి ధాగా, అక్టోబర్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో వరుణ్ ధావన్ చివరిసారిగా డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన కూలీ నెం 1 లో కనిపించాడు. కూలీ నెం 1 1995 చిత్రం యొక్క రీమేక్. ఇందులో గోవింద, కరిష్మా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రీమేక్ లో వరుణ్ ధావన్ సరసన సారా ఆలీఖాన్ నటించారు. ప్రతిదీ సరిగ్గా ప్లాన్ చేసినప్పటికీ, రీమేక్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే, ఇది ఒటిటిలో చాలా రికార్డులను సృష్టించింది.

కూలీ నెం 1 చిత్రానికి ముందు వరుణ్ ధావన్ సినిమాలు రెండు బాగా ఆడటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. లాక్ డౌన్ సమయంలో థియేటర్లు మూసివేయడంతో  ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఒప్పందం కుదుర్చుకుంది. కూలీ నంబర్ 1 కోసం వరుణ్ ధావన్ కు రూ .25 కోట్లు చెల్లించినట్లు తెలిసింది. ఇప్పటివరకు  ఇదే  అతనికి అత్యధిక పారితోషికం కావడం విశేషం.

మరోవైపు  ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు డేవిడ్ ధావన్ రూ.15 కోట్ల మొత్తాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన రోహిత్ ధావన్‌కు రూ .7 కోట్లు చెల్లించారు. మొత్తం మీద ధావన్ కుటుంబం ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ .50 కోట్లు వసూలు చేసింది.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox