Breaking News

ప్లాప్ అయిన సినిమాకు అంత టీఆర్పీయా?

05 th Jul 2020, UTC
ప్లాప్ అయిన సినిమాకు అంత టీఆర్పీయా?

తమిళ స్టార్ హీరో ధనుష్, ‘మహానటి’ కీర్తిసురేష్ కలిసి నటించిన చిత్రం ‘రైల్’. నాలుగు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రం అప్పట్లో తెలుగు, తమిళ్‌లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అందుకే ఈ సినిమా ఒకటి ఉందనే విషయం కూడా ఎవరికీ తెలియదు. అయితే ఈ సినిమా ఇప్పుడొక రికార్డ్‌ను అందుకుంది.

ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను 4 సంవత్సరాల తర్వాత స్టార్ మా ఛానెల్ తీసుకుంది. ప్రస్తుతం థియేటర్స్‌లో సినిమాలు లేక బుల్లితెర బాట పట్టిన ప్రేక్షకులను మెప్పించడానికి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ నానా పాట్లు పడుతున్నాయి. అందులో భాగంగానే ఈ చిత్రం కాస్త కొత్తగా ఉంటుందని భావించి ఉండవచ్చు

. దాదాపు రూ. 60 లక్షల వరకు ఈ సినిమాకు సదరు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ పెట్టినట్లుగా తెలుస్తుంది. రీసెంట్‌గానే ఈ సినిమాని టెలికాస్ట్ కూడా చేశారు. అయితే లాస్ట్ ఇయర్ భారీ హిట్ అయిన కార్తీ ‘ఖైదీ’, సూర్య ‘ఎన్.జి.కె’ వంటి చిత్రాల కంటే ఎక్కువ టీఆర్పీ ఈ చిత్రం రాబట్టిందని తెలుస్తుంది.

 ఫస్ట్ టైమ్ టెలికాస్ట్ అయిన ఈ సినిమాకు 4.71 టీఆర్పీ వచ్చిందని ఛానల్ ప్రకటించింది. నిజంగా ఇది రికార్డే మరి. ఎందుకంటే తెలుగు, తమిళ్‌లో కూడా ఈ చిత్రం ప్లాప్, అలాగే యూట్యూబ్‌లో కూడా విడుదలైంది. అయినా కూడా ఇంత టీఆర్పీ అంటే హక్కులు తీసుకున్న ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ పంట పండినట్లే.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox