Breaking News

దీపికా పదుకునే మేనేజర్ పరారీ..!

31 st Oct 2020, UTC
దీపికా పదుకునే మేనేజర్ పరారీ..!

బాలీవుడ్ లో సుశాంత్ ఆత్మహత్య కేసు. బాలీవుడ్ లోని డ్రగ్స్ మాఫియాను బయటకు లాగిన సంగతి తెలిసిందే. అయితే ఇపుడు ఈ కేసు అనూహ్యమైన మలుపు తీసుకుంది. డ్రగ్స్ మాఫియా కేసులో ఆదినుంచి కీలకంగా ఉన్న దీపిక పదుకోన్ టాలెంట్ మేనేజర్ కరిష్మా ప్రకాష్ ప్రస్తుతం పరారీలో ఉంది. 3 రోజుల నుంచి ఆమె ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారుల ఫోన్స్ కి స్పందించడం లేదు. ఆమె అందుబాటులో ఉండడం లేదు. ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు.
 
ముంబయిలోని వెర్సోవాలో కరిష్మా నివాసం ఉంటున్నారు. గత వారం నార్కోటిక్ పోలీసులు ఆమె నివాసంలో దాడులు నిర్వహించగా 1.7 గ్రాముల నిషేధిత మాదకద్రవ్యాలు కనిపించాయి. అయితే ఆమెకు విచారణకు హాజరు కావలసిందిగా పోలీసులు నోటీసులు పంపించారు.ఆ మరుసటి రోజు నుంచి ఆమె కనిపించడం లేదు. అయితే విచారణకు హాజరు కాకపోవడంతో పోలీస్ లు ఆమెకు మరో సారి నోటీసులు పంపించారు. ఆమె మొబైల్ స్విచాఫ్ లో ఉందని, మెయిల్ కి కూడా స్పందించడం లేదని అధికారులు చెబుతున్నారు.

సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ మాఫియా వెలుగు చూడడంతో ఇందులో సంబంధం ఉన్న రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే కరిష్మా ప్రకాష్ వాట్సాప్ ఛాట్స్ వెలుగులోకి రావడంతో అనుమానం వచ్చిన అధికారులు దీపిక, సారా, రకుల్, శ్రద్ధాకపూర్లను కూడా విచారించారు. ఆ వాట్సాప్ చాట్ ఆధారంగానే కరిష్మాను విచారించి, డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. అత్యంత కీలకంగా వ్యవహరించిన కరిష్మా తాజాగా అదృశ్యమవడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox