Breaking News

కలెక్షన్ కింగ్ తో జతకడుతున్న మీనా

26 th Feb 2021, UTC
కలెక్షన్ కింగ్ తో జతకడుతున్న మీనా

కలెక్షన్  కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు డైరెక్టర్ డైమండ్ రత్నబాబు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మోహన్ బాబుకు జంటగా సీనియర్ హీరోయిన్ని లైన్ లో పెట్టారు మేకర్స్. దృశ్యం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మీనాని మోహన్ బాబుకి జోడిగా ఎంపిక చేసారని తెలుస్తోంది .

మీనా గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్నేళ్లపాటు తెలుగు ప్రేక్షకులను హీరోయిన్ గా అలరించింది. అంతేగాక మోహన్ బాబుతో కూడా పలు సినిమాల్లో నటించింది మీనా.

అయితే చాలకాలం తర్వాత మీనా మళ్లీ మోహన్ బాబుకు భార్య పాత్రలో నటించనుంది. ఆమె క్యారెక్టర్ అద్భుతంగా డిజైన్ చేసినట్లు టాక్. అప్పట్లో మోహన్ బాబు మీనా కలిసి నటించిన రొమాంటిక్ అల్లరిమొగుడు మూవీ సూపర్ హిట్. ఈ సినిమా స్క్రీన్ ప్లేలో మోహన్ బాబు కూడా చేయి వేసారని తెలుస్తోంది. ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండటం విశేషం. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox