Breaking News

టాలీవుడ్ పై వరాలు కురిపించిన సీఎం జగన్..!

10 th Jun 2020, UTC
టాలీవుడ్ పై వరాలు కురిపించిన సీఎం జగన్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు నిర్వహించిన సమావేశం సక్సెస్ అయింది. సినీ పెద్దలు అడిగిన ప్రతీ విషయానికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు.వారి వినతులన్నింటికీ ఓకే అన్నారు. విశాఖలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్దే తన లక్ష్యమని దాని కోసం తన సహకారం పూర్తిగా వుంటుందని హామీ ఇచ్చారు.
సీఎంతో  భేటీకి టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి అక్కినేని నాగార్జున డైరెక్టర్ రాజమౌళి నిర్మాతలు సి. కళ్యాణ్ డి. సురేష్ బాబు దిల్ రాజు పీవీపీ దామోదర్ ప్రసాద్ లు హాజరయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఇప్పటికే దేశంలోనే మొదటగా ఏపీ ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతి ఇచ్చి సింగిల్ విండో పద్దతిలో అనుమతులు ఇచ్చేలా జీవో జారీ చేసిన నేపథ్యంలో సీఎం జగన్ కు చిత్ర పరిశ్రమ తరుపున ధన్యవాదాలు తెలియజేసారు


సీఎంతో సమావేశం అనంతరం ఈ నెల 15 తర్వాత ఏపీలో షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. సీఎం జగన్‌తో చర్చించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. లాక్‌డౌన్‌ సమయంలో షూటింగ్‌లు స్తంభించిపోయాయని, దీంతో షూటింగ్‌లు చేసుకునేందుకు అనుమతి ఇస్తామని జగన్‌ చెప్పారన్నారు. త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని సీఎం చెప్పారని, సినీపరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారన్నారు. విశాఖలో స్టూడియోకి గతంలో వైఎస్‌ చేసిన భూ కేటాయింపులను పునపరిశీలిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారన్నారు. థియేటర్లలో మినిమం ఫిక్స్‌డ్‌ ఛార్జీలు ఎత్తివేయాలని కోరామని దానిపై సానుకూలంగా స్పందించారన్నారు. 2019-20 నంది అవార్డులు ఇచ్చేందుకు అంగీకరించినట్టు చిరంజీవి చెప్పారు.  

తరువాత మీడియాతో మాట్లాడిన ఏపీ  మంత్రి పేర్ని నాని ఏపీలో సినీ పరిశ్రమకి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ సినీ ప్రముఖులకు హామీ ఇచ్చారని తెలిపారు. చిన్న సినిమాలకి సంభందించి సబ్సిడీలు ఏమైతే ఉన్నాయో సీఎం ఆదేశాల మేరకు ఇవ్వడం జరుగుతుందని.. వైజాగ్ లో స్టూడియోలు నిర్మాణం చేసుకుంటే రాయితీలు అందిస్తామని.. భవిష్యత్ లో సినిమా వారికి ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని వెల్లడించారు. అంతేకాకుండా నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని.. జూలై 15 తర్వాత సినిమా షూటింగులు మొదలయ్యేలా విధివిధానాలు రూపొందించామని సీఎం ఆదేశించారని మినిస్టర్ పేర్ని నాని తెలిపారు.
 
 
 
 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox