Breaking News

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కణ్ణన్‌ కన్నుమూత..!

14 th Jun 2020, UTC

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కణ్ణన్‌ (69) శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు చెన్నైలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

. కణ్ణన్‌ ప్రముఖ తమిళ నిర్మాత, రచయిత, దర్శకుడు భీమ్‌సింగ్‌ కుమారుడు. బి. కణ్ణన్‌గా అందరికీ తెలిసిన ఈయన ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజాతో ఎక్కువ చిత్రాలకు పనిచేశారు. ఒక్క భారతీరాజాతోనే దాదాపు 40 సినిమాలు చేశారు కణ్ణన్‌. అందుకే  తమిళనాడులో ‘భారతీరాజా విన్‌కన్‌గళ్‌’ (భారతీరాజా కళ్లు) గా ఆయన ప్రసిద్ధి చెందారు.

వీరద్దరి కాంబినేషనలో వచ్చిన మొదటి చిత్రం నిజల్‌గళ్ కాగా  చివరి చిత్రం ‘బొమ్మలాట్టమ్‌’ (2008). తమిళ్, తెలుగు, మలయాళ భాషల్లో పలు చిత్రాలకు కెమెరామేన్‌గా పనిచేశారు కణ్ణన్‌. తెలుగులో ఆయన కెమెరామేన్‌గా పని చేసిన చిత్రాల్లో ‘సీతాకోకచిలుక’, ‘ఆరాధన’ వంటి హిట్‌ చిత్రాలు ఉన్నాయి.

కణ్ణన్‌కు భార్య కాంచన, కుమార్తెలు మధుమతి, జనని ఉన్నారు. ఫిల్మ్‌ మేకర్‌ బి. లెనిన్‌కి సోదరుడు కణ్ణన్‌. బి. కణ్ణన్‌ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కణ్ణన్‌ అంత్యక్రియలు నేడు చెన్నైలో జరుగుతాయి.
 
Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox