Breaking News

పాటలు పాడి 82 లక్షల విరాళాలు సేకరించిన గాయని చిన్మయి

15 th Sep 2020, UTC

ప్ర‌ముఖ‌ గాయ‌ని చిన్మ‌యి శ్రీపాద అభిమానుల కోసం పాట‌లు పాడుతూ, శుభాకాంక్ష‌లు చెప్తూ 82 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను విరాళంగా సేక‌రించారు. ఈ మొత్తాన్ని లాక్‌డౌన్ వ‌ల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాల‌కు అందించనున్నారు. క‌రోనా వ‌ల్ల చిన్నాభిన్న‌మ‌వుతున్న కుటుంబాల‌ను చూసి చ‌లించిపోయిన చిన్మ‌యి ఏప్రిల్‌  నెలలో ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. బ‌ర్త్‌డే విషెస్ గానీ, ఎవ‌రి కోస‌మైనా పాట డెడికేట్ చేయాల‌న్నా, ఇంకేదైనా శుభాకాంక్ష‌లు చెప్పాల‌న్నా ‌వారు ముందుగా చారిటీకి ఎంతో కొంత డ‌బ్బులు డొనేట్ చేసి ఆ మొత్తాన్ని స్ర్కీన్‌షాట్ తీసి పంపాలి. అప్పుడు వారి కోసం ఆమె పాట పాడి ఆ వీడియోను పంపిస్తారు. అలా ఇప్ప‌టివ‌ర‌కు మూడు వేల‌కు పైగా వీడియోల‌ను పంపించి  85 ల‌క్ష‌ల డ‌బ్బు జ‌మ చేశారు.

చిన్మ‌యి మాట్లాడుతూ "క‌రోనా వ‌ల్ల‌ ఎంతోమందికి ఉపాధి లేకుండా పోయింది. ఒక రోజు త‌మిళ‌నాడులోని ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు, అక్క‌డి విద్యార్థుల‌కు సాయం చేయాల్సిందిగా న‌న్ను కోరాడు. 800 కుటుంబాల దీన ప‌రిస్థితి గురించి వివ‌రాల‌తో స‌హా మాకు పూర్తి స‌మాచారం పంపారు. అది ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌ని క‌నుక్కుంటే ఎన్నో విష‌యాలు తెలిశాయి. చాలా మంది పిల్ల‌ల త‌ల్లిదండ్రులు రోజువారీ కూలీలు. మ‌రికొంద‌రు శారీర‌క‌, మాన‌సిక ప‌రిస్థితి బాగోలేనివారు. హ‌ఠాత్తుగా వ‌చ్చిప‌డ్డ‌ క‌రోనా వైప‌రీత్యం వ‌ల్ల వారికి పూట గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా మారింది. అప్పుడే వారికి సాయం చేయాలని నిర్ణ‌యించుకున్నానని తెలిపారు. ఎవ‌రైనా స‌రే, ఏదైనా పాట కావాల‌న్నా, శుభాకాంక్ష‌లు చెప్పాల‌న్నా విరాళ‌మిస్తే చాలు వీడియోలు చేసి పంపించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తనను అడిగిన వారిలో ఎక్కువ‌ మంది బర్త్‌డే విషెస్ చెప్ప‌మ‌ని అడిగేవారని, ఒక్కోరోజు 75 వీడియోలు కూడా చేశాన‌ని ఆమె పేర్కొన్నారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox