Breaking News

'ఆర్ ఆర్ ఆర్' కు రిలీజ్ డేట్ పెట్టిన చిచ్చు.. మండిపడుతున్న బోనికపూర్..!

27 th Jan 2021, UTC

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ డేట్ వచ్చేసింది. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవడం లేదు. రిలీజ్ డేట్ ప్రకటించినప్పటినుంచి ఎదో ఒకటి తెరపైకి వస్తూనే ఉంది. జనవరిలో విడుదల కావాల్సిన ఆర్ ఆర్ ఆర్ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. దీనితో, ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనీ భావిస్తూ, అక్టోబర్13వ తేదీని లాక్ చేసారు. అయితే, ఈ తేదీ పట్ల మొదట డిస్ట్రిబ్యూటర్లు అసంతృప్తిని వ్యక్తం చేసారు. 

ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ బడ్జెట్ సినిమాను దసరా కంటే, సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుందని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. దసరా కూడా సినిమా రిలీజ్ కి మంచి ముహూర్తమే అయినా, సంక్రాంతికి విడుదల అయ్యే సినిమాలకు వచ్చే లాభాల లెక్క వేరుగా ఉంటుంది. యావరేజ్ సినిమాలు కూడా సంక్రాంతికి మాగ్జిమమ్ కలెక్షన్స్ ను సాధిస్తాయి. అలాంటిది ఆర్ ఆర్ ఆర్ మరింత ఎక్కువ లాభాల పంట పండిస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

మరో వైపు బోనికపూర్ కూడా రాజమౌళి నిర్మాతలపై కస్సుమంటున్నారు. తాను నిర్మిస్తున్న 'మైదాన్' చిత్రాన్ని అక్టోబర్ 15న విడుదల చేయబోతున్నట్లు ఆయన ఆరునెలల క్రితమే ప్రకటించారు. ఈ సమయంలో రెండు రోజుల ముందుగా ఆర్ ఆర్ ఆర్ ను విడుదల చేయడం అన్యాయమని బోని కపూర్ మండిపడుతున్నారు. అందరు కలిసి ఈ చిత్ర సీమను ఆదుకోవాల్సిన సమయంలో ఇలా చేయడం సరికాదంటూ ఆయన ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. మరిన్ని వార్తలు చదవండి 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox