Breaking News

40 లీటర్ల చనుబాలు దానం చేసిన బాలీవుడ్ నిర్మాత

19 th Nov 2020, UTC

బాలీవుడ్ :తల్లి పాలు శిశువుకు ఎంతో ఆరోగ్యమని వైద్యులు, నిపుణులు తరచుగా చెప్పడం మనకు తెలిసిన విషయమే. ముంబయ్ కు చెందిన ఒక మాతృమూర్తి తన బిడ్డకు మాత్రమే కాకుండా ఎంతోమంది చిన్నారులకు తన చనుబాలు దానం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. సాంద్‌‌ కీ ఆంక్‌ సినిమాకు నిర్మాతగా పనిచేసిన 42 ఏళ్ల నిధి పర్మార్‌ హిరా నందిని ఈ ఏడాది ఫిబ్రవరిలో మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే నిధికి పాల ఉత్పత్తి అధికంగా ఉంది. తన కొడుక్కి పాలు పట్టిన తరువాత కూడా పాలు మిగులుతుండటంతో వాటిని వృథా చేయకూడదని అనుకున్నారు. తల్లి పాలను ఫ్రిజ్‌లో సరిగా స్టోర్‌ చేస్తే మూడు నుంచి నాలుగు నెలల వరకు నిల్వ ఉంచవచ్చని గ్రహించారు. దీంతో ఎక్కువైన పాలను పాలు దొరక్క ఇబ్బంది పడుతున్న చిన్నారులకు అందించాలని నిర్ణయించుకున్నారు. తన పాలను డొనేట్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఎలా చేయాలన్న విధానంపై తీవ్రంగా ఆలోచించారు. ఇందుకోసం అనేక మందిని ఇందుకు సంబంధించిన వివరాలను అడగ్గా అమెను అందరూ ఎగతాళి చేశారు. ఎవరూ సరైన వివరాలు చెప్పలేదు.

దీంతో ఆన్‌లైన్‌లో డొనేషన్ సెంటర్ల వివరాలను తెలుసుకున్నారు. చివరకు ముంబైలోని సూర్య హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ వార్డులోని పిల్లల కోసం తన పాలను డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. నా బిడ్డకు పాలు పట్టిన కూడా నాకు చాలా పాలు మిగిలాయి. వాటిని నేను ఎందుకైనా ఉపయోగించుకోవాలనుకున్నాను. నా స్నేహితులను అడిగితే ఆభరణాల తయారీ, ఫేస్‌ ప్యాక్‌, స్క్రబ్ వంటి సలహాలు ఇచ్చారు. కానీ నేను అందుకు ఇష్టపడలేదు. 

తరువాత నెట్‌లో శోధించి ఒక గైనకాలజిస్టు ద్వారా ముంబైలోని ఓ ఆసుపత్రిలో తల్లి పాలు డొనేట్‌ చేస్తారని తెలుసుకున్నాను. వెంటనే అప్పటి నుంచి 40 లీటర్లకు పైగా పాలు దానం చేశాను. ఇంత మంది పిల్లలకు పాలు అందించడం గొప్పగా ఫీల్‌ అవుతున్నాను’ అని నిధి పర్మార్‌ తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox