Breaking News

ఎఫ్‌సిఎటి రద్దు పై బాలీవుడ్ అసంతృప్తి

08 th Apr 2021, UTC
ఎఫ్‌సిఎటి రద్దు పై బాలీవుడ్ అసంతృప్తి

ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎఫ్‌సిఎటి), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్‌సి) ఆదేశాల వల్ల ఇబ్బందిపడుతున్న చిత్రనిర్మాతల విజ్ఞప్తులను విచారించడానికి ఏర్పాటు చేసిన ఒక చట్టబద్దమైన సంస్థ. దీనిని రద్దు చేస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై నిర్మాతలు ఎఫ్‌సిఎటి బదులుగా హైకోర్టులను ఆశ్రయించాలని కేంద్రం పేర్కొంది.

మంత్రిత్వ శాఖ నిర్ణయం పై పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేసారు. హన్సల్ మెహతా ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ, "ఫిల్మ్ సర్టిఫికేషన్ ఇబ్బందులనుపరిష్కరించడానికి హైకోర్టులకు చాలా సమయం ఉందా? ఎంత మంది సినీ నిర్మాతలకు కోర్టులను సంప్రదించడానికి మార్గాలు ఉంటాయి? ఎఫ్‌సిఎటి నిలిపివేత ఏకపక్షంగా అనిపిస్తుంది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాలి? అంటూ ట్వీట్ చేసారు.సినిమాకు ఇది విచారకరమైన రోజు అని విశాల్ భరద్వాజ్ రాశారు, విశాల్ భరద్వాజ్ ట్వీట్‌కు గునీత్ మోంగా సమాధానమిస్తూ, "ఇలాంటివి ఎలా జరుగుతాయి? ఎవరు నిర్ణయిస్తారు? అంటూ రాసారు.

ఎఫ్‌సిఎటి  గతంలో చాలా మంది చిత్రనిర్మాతలకు ఉపయోగకరంగా ఉంది. లిప్‌స్టిక్‌ అండర్ మై బుర్ఖా ను ధృవీకరించడానికి సిబిఎఫ్‌సి నిరాకరించడంతో 2017 లో అలకృత శ్రీవాస్తవ ఎఫ్‌సిఎటిని సంప్రదించారు. కొన్ని సవరణలను సూచించిన తరువాత ఈ చిత్రానికి ఎ సర్టిఫికేట్ మంజూరు చేయాలని సిబిఎఫ్‌సిని ఎఫ్‌సిఎటి ఆదేశించింది.అనురాగ్ కశ్యప్ యొక్క ఉడ్తా పంజాబ్‌ను 2016 లో క్లియర్ చేయడానికి సిబిఎఫ్‌సి నిరాకరించింది. ఎఫ్‌సిఎటి జోక్యం తో  ఈ చిత్రం విడుదలైంది. అదేవిధంగా, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన బాబుమోషాయ్ బందూక్‌బాజ్‌కు  ఎఫ్‌సిఎటి సహాయం చేసింది. మరిన్ని వార్తలు చదవండి

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox