Breaking News

ముఖ్యమంత్రి అయి ఉండి.. ఆ పని కూడా చేయలేదు.. విజయశాంతి 

19 th Jan 2021, UTC

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాల నుంచి రెటైర్ అయిపోయారని, ప్రజల మధ్యకు రాకుండా ప్రగతి భవన్ నుంచి పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓ పక్కన ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూడా, సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు రావడం లేదని మండిపడ్డారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నపుడు కూడా పనులు దగ్గరుండి చూడలేదని, ప్రజలకు ధైర్యం కూడా చెప్పలేక పోయారన్నారు. ముఖ్యమంత్రి అయి ఉండి..కనీసం ఈ పని కూడా చేయలేదన్నారు. 

తెరాస పార్టీలో ఎక్కువ మంది గుండాలే ఉన్నారని, ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి నేతల వరకు అందరు బూతులు మాట్లాడతారని మండిపడ్డారు. తెరాస పాలనాలో దోపిడీ ఎక్కువైందని, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మరో ఉద్యమం జరగాల్సిందేనన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. తెలంగాణలో ప్రజలు అమాయకులని, వారిని చైతన్యవంతం చేయాలన్నారు.

దుబ్బాక, జీహెచ్ఎంసి ఎన్నికల్లో మహిళలు కీలక పాత్ర పోషించారని వారిని ప్రశంసించారు. మహిళను ముందుపెడితే ఓడిపోతామని అనుకుంటారని, మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని విజయశాంతి కేసీఆర్ ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేసారు. మహిళలను ఎదుర్కొనలేకే, సోషల్ మీడియాలో మహిళలను కించపరిచే విధంగా పోస్ట్ లు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox