Breaking News

మోనాల్ కి బిగ్ బాస్ సర్ ప్రైజ్..!

20 th Nov 2020, UTC
మోనాల్ కి బిగ్ బాస్ సర్ ప్రైజ్..!

బిగ్ బాస్ :మొన్నటి ఎపిసోడ్ లోని ఫామిలీ చిత్రం నిన్న కూడా కొనసాగింది. అందరు కంటెస్టెంట్స్ ఫామిలీ మెంబెర్స్ వచ్చి ఇంటి సభ్యులను ఉత్సాహపరిచారు. అయితే, మోనాల్ తల్లి మాత్రం రాలేదు. ఆమె వాయిస్ ని మాత్రం బిగ్ బాస్ వినిపించారు. "మోనాల్ బేటా" అంటూ మోనాల్ తల్లి వాయిస్ వినిపించింది. కానీ ఎవరు కనిపించకపోవడంతో మోనాల్ కన్నీరుమున్నీరైపోయింది. "మోనాల్ ఎలా ఉన్నావు, మేము బాగున్నాం. హైదరాబాద్ కి రావాల్సి ఉంది. కానీ రాలేకపోయాం. రోజు నిన్ను టీవీలో చూస్తున్నాం. ప్రతిదానికి ఏడవమాకు. అందరితోనూ మంచిగా ఆడు" అంటూ మోనాల్ తల్లి వాయిస్ వినిపించారు. 
 
అయితే, మోనాల్ తల్లి రాకపోవడంతో మోనాల్ చాలా ఫీల్ అయిపొయింది. తల్లి వాయిస్ ఓవర్ వినిపించగానే మోనాల్ టాప్ తిప్పేసింది. గుక్క పెట్టి ఏడ్చేసింది. బాధని భరించలేక బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి ఏడ్చేసింది. అయితే, కొంతసేపటికి బయటకు వచ్చి జై శ్రీకృష్ణ అంటూ కన్నీళ్లు తుడుచుకుంది. అంతలోనే ఆమె కు బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇంటిలోకి మోనాల్ అక్క ఎంట్రీ ఇచ్చారు. అసలే మోనాల్ చిన్న విషయానికే ఏడ్చేస్తూ ఉంటుంది. ఆ ఏడుపు ఇంకా కావాలనుకున్నాడో ఏమో, బిగ్ బాస్ డ్రామా పండించాడు.
 
హౌస్ లోకి, మోనాల్ అక్కను డైరెక్ట్ గా పంపించకుండా తల్లి వాయిస్ ని వినిపించారు. ఆ తరువాత మోనాల్ అక్క హేమాలి రాగానే, పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఎలా ఉన్నావ్ అక్కా పలకరించింది. "చాలా బాగున్నావు. అమ్మ ఎలా ఉంది.. అమ్మ చాలా మిస్ అవుతుంది. ఇక్కడకు వచ్చే ముందు కునాల్‌తో మాట్లాడావా?? " అంటూ మోనాల్ వరుస ప్రశ్నలు కురిపించింది. అందరితోనూ చక్కగా మాట్లాడిన హేమాలి, అభిజిత్ కు మాత్రం చిన్న వార్నింగ్ ఇచ్చింది. ఏదైనా ఉంటె డైరెక్ట్ మాట్లాడు. వెనక ఒకటి ముందు ఒకటి మాట్లాడద్దు అని చెప్పింది. ముందు మాట్లాడుకుంటే బెటర్ కదా అని చిన్న ఝలక్ ఇచ్చింది. 
 
అలాగే, మోనాల్ కి కూడా పడ్డాక ఏడవద్దంటూ క్లాస్ పీకింది. ఇంకోసారి ఏడ్చావంటే కొడతా. ప్రతిసారి ఏడవకు అంటూ సలహా ఇచ్చింది. అఖిల్ గురించి, తన గురించి చేదుగా అనుకుంటున్నారా అని మోనాల్ అడిగింది. అయితే అక్క సైలెంట్ గా ఉంది. ఇద్దరు గుజరాతీ అక్క చెల్లెళ్ళు మాట్లాడుకున్న మాటలు తెలుగు ప్రేక్షకులకు అంతగా అర్ధం కాకపోయినా, మొత్తానికి మోనాల్ సిస్టర్ వచ్చేసరికి హ్యాపీగానే ఉంది. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox