Breaking News

ఆ హీరోల సినిమాలకు బిగ్‌షాక్‌ టాలీవుడ్‌కు జగన్‌ ఝలక్‌ - GOPALA RAMESH

24 th Nov 2021, UTC

బడా నిర్మాతలకు బిగ్‌ షాక్‌.. యస్‌..... జగన్‌ సర్కార్‌ నిర్ణయంతో టాలీవుడ్‌ ఉలిక్కిపడింది. ఒకే ఒక్క నిర్ణయంతో పెద్ద నిర్మాతలకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. అసెంబ్లీలో చేసిన చట్టంతో మెగా, నందమూరి, ఘట్టమనేని ఫ్యామిలీ హీరోలకు గట్టి దెబ్బే అని భావిస్తున్నారు. ఇంతకీ ఏమిటా నిర్ణయం ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని తప్పసరి చేస్తూ.. అసెంబ్లీలో చట్టం చేసింది. ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ ఎమెండ్మెంట్ బిల్ ను మంత్రి పేర్ని నాని సభలో ప్రవేశ పెట్టారు. ఈ సవరణ ప్రకారం ప్రభుత్వ సంస్థ ఆన్ లైన్ బుకింగ్ ప్లాట్ ఫామ్ ద్వారానే టికెట్ కొనాలి. థియేటర్స్‌లో ఇకనుంచి టికెటింగ్ కు అనుమతి లేదు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ తరపున సమాచార శాఖ మంత్రి పేర్ని నాని బిల్లును ప్రవేశపెట్టారు. సినిమా ప‌ట్ల పేద‌,మ‌ధ్యవ‌ర్గాల‌కు ఉన్న ప్రేమ‌ను, ఆపేక్షను, న‌మ్మకాన్ని సోమ్ము చేసుకోవ‌డానికి కొందరు చూస్తున్నారు. దీన్ని నియంత్రించ‌డానికే ఆన్ లైన్ టికెటింగ్ ను తీసుకురావాల‌ని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.ఆ తర్వాత... సినిమాటోగ్రఫి చట్టానికి సవరణ చేసేందుకు ఉద్దేశించిన బిల్లును శాసనసభ ఆమోదించింది. దీంతో సినిమా టికెట్లను ఆన్‌లైన్‌ విక్రయించే పద్ధతికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. కొత్త నిబంధనల మేరకు రోజుకు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించేందుకు వీలు ఉంటుంది. బెనిఫిట్‌ షోల కట్టడికి చట్టంలో మార్పులు చేశారు. మొత్తంమీద... బడా సినిమాలకు భారీ షాక్ ఇచ్చింది ప్రభుత్వం.. కొత్త చట్టం ప్రకారం ఇక నుంచి ఏపీ సినిమా హాళ్లలో కేవలం నాలుగు షో లే నిర్వహించాలి. ఈ నిర్ణయం టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలని నిర్ణయించింది. అదనపు షోలకు అవకాశం లేదని స్పష్టం చేసింది.అలాగే అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేట్ ను నిర్ణయించింది. గతంలో పెద్ద హీరో సినిమాలకు 200 నుంచి 500 రూపాయలుకు పైగా థియేటర్‌లో అమ్మిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అన్ని సినిమాలకు ఒకటే రేటు ఉండనుంది. ఇదిలా ఉంటే రాబోయే సినిమాలన్నీ పెద్ద సినిమాలే.. దాంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం.

 దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్, అల్లు అర్జున్ పుష్ప, మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్, బాలయ్య అఖండ, మహేశ్‌బాబు సర్కారువారీపాట సినిమాలపై  దీని ప్రభావం పడే అవకాశం ఉంది. రానున్న ఆరు నెలల్లో బడా సినిమాలన్నీ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా పై ఈ ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది. అలాగే పుష్ప, ఆచార్య, భీమ్లా నాయక్, అఖండ, సర్కార్‌వారీ పాట సినిమాల నిర్మాతలకు, డిస్టిబ్యూటర్స్ కు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. కరోనా తర్వాత కోలుకుంటున్న టాలీవుడ్ కు ఒకవిధంగా చెప్పాలంటే ఇది బిగ్ షాకే అంటున్నారు సినీరంగ ప్రముఖులు. గతంలో పలుసార్లు సినీరంగ ప్రముఖులు సీఎం జగన్‌, మంత్రి పేర్నినానిని కలిశారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానంపై చర్చించారు. అయితే - అప్పుడు కేవలం నాలుగు షోలు, బెనిఫిట్‌ షోల రద్దు ప్రస్తావన రాలేదు. కానీ కొత్త చట్టంలో అవన్నీ ఉండటంతో ఇండస్ట్రీ వర్గాలు ఉలిక్కిపడుతున్నాయి. చాలాకాలంగా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న బడా సినిమాలకు ప్రభుత్వం నిర్ణయం మింగడుపడటం లేదని తెలుస్తోంది. మరి దీనిపై టాలీవుడ్ పెద్దలు, నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox