Breaking News

బెంగాల్ లో మరో మోడల్ ఆత్మహత్య

27 th May 2022, UTC
బెంగాల్ లో మరో మోడల్ ఆత్మహత్య

Kolkata: బెంగాల్ లో మరో మోడల్ ఆత్మహత్యకు పాల్పడింది. మంజూషా నియోగి అనే మోడల్ కోల్ కతా పటులి ప్రాంతంలో తన నివాసంలో శవమై కనిపించింది. మూడు రోజుల వ్యవధిలో కోల్ కతాలో ఇద్దరు మోడల్స్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవల మంజూషా నియోగి స్నేహితురాలు మోడల్ బిదిషా డి మజుందార్ ఆత్మహత్య చేసుకుంది. దీంతో గత రెండు రోజుల నుంచి తీవ్రమైన డిప్రెషన్ తో మంజూషా నియోగి బాధపడుతోంది. తన కూతురు డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు ఆమె తల్లి కూడా వెల్లడించింది.

పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. మంజూషా స్నేహితురాలు బిదిషా మజుందార్ పెళ్లి కూతురు యాడ్స్, ఫోటో షూట్ లకు ఫేమస్. ఇటీవల కాలంలో అవకాశాలు లేకపోవడంతో కుంగిపోయి ఆత్మహత్య పాల్పడింది. కెరీర్లో అవకాశాలు లేకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ లెటర్ ను రాసి ఆత్మహత్య చేసుకుంది.

ఈ రెండు ఘటనలకు కొన్ని రోజుల ముందు మరో మోడల్, ఆర్టిస్ట్ పల్లబి డే కూడా కోల్ కతాలోని గార్ఫా ప్రాంతంలో అద్దె నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఉరివేసుకుని పల్లబి డే ఆత్మహత్యకు పాల్పడింది. వరసగా ఒకే నెలలో ముగ్గురు ఫేమస్ మోడల్స్ తనువు చాలించడం గ్లామర్ ఇండస్ట్రీని కలవరానికి గురి చేసింది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox