Breaking News

సరిలేరు నీకెవ్వరులో చేసినందుకు తిట్టారు:బండ్ల గణేష్

09 th Jul 2020, UTC

బండ్ల గణేష్‌ కరోనా  నుంచి ఒక్క వారంలోనే  రికవరీ అవ్వడంతో ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా  ఓ యూట్యూబ్ ఛానల్‌కు బండ్ల గణేష్ ఇంటర్వ్యూలో ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు.

 అందులో ముఖ్యంగా పవన్ కల్యాణ్ గురించి, ఏపీ సీఎం జగన్ పరిపాలన గురించి, తనకు కరోనా వచ్చినప్పుడు చిరంజీవిగారు చేసిన ఫోన్ గురించి ఇలా అనేక విషయాలను ఆయన తెలియజేశారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫుల్ వీడియో ఇంకా టెలికాస్ట్ కాలేదు కానీ ప్రోమో మాత్రం వదిలారు.

అయితే ఈ ప్రోమోలో బాగా హైలెట్ అవుతున్నది మాత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఆయన చేసిన పాత్ర గురించి, ఆ పాత్రకు వచ్చిన రెస్పాన్స్ గురించి చేసిన సంచలన వ్యాఖ్యలే. చాలా గ్యాప్ తర్వాత ఆయన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు. ‘

సరిలేరు నీకెవ్వరులోని పాత్ర నాకు మంచి పేరు తీసుకురాలేదు. ఆ పాత్ర నాకు తృప్తినివ్వలేదు. నా ఆప్తులందరూ ఎందుకు చేశావని తిట్టారు నన్ను. నేను అట్లాంటి వేషాలు చేయకూడదు. ఇకపై నేను యాక్టింగ్ చేయదలుచుకోలేదు.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. మరి ఫుల్ ఇంటర్వ్యూ విడుదలైన తర్వాత ఆయన చేసిన ఈ కామెంట్స్ మరింత రచ్చరేపడం ఖాయం. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox