Breaking News

కూరగాయలమ్ముతున్న టీవీ సీరియల్ డైరక్టర్

28 th Sep 2020, UTC
కూరగాయలమ్ముతున్న టీవీ సీరియల్ డైరక్టర్

ఉత్తరప్రదేశ్ :దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన డైలీ సీరియల్‌ బాలిక వధూ (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) కు దర్శకుడిగా రామ్ వ్రిక్ష గౌర్  ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లోని ఆజామ్‌గఢ్ జిల్లాలో కూరగాయలు అమ్ముతున్నారు. లాఓ సినిమా షూటింగ్ కోసం లొకేషన్స్ వెతకడంలో భాగంగా రెక్కి నిర్వహించేదుకు అజమ్ గఢ్‌కు వచ్చాను. ఆ సమయంలోనే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. అజమ్‌గఢ్ నుంచి తిరిగి వెళ్లడం సాధ్యం కాలేదు. ఈ లోపు నా వద్ద ఉన్న డబ్బు ఖర్చు అయిపోయింది. ముంబైకి వెళ్లే పరిస్థితి లేదు. సినిమా మొదలయ్యే అవకాశం కనిపించలేదు అని గౌర్ తెలిపారు.

లాక్‌డౌన్ కారణంగా తాము ప్రారంభించాల్సిన ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. నిర్మాత ఇప్పట్లో సినిమాను ప్రారంభించడం సాధ్యం కాదని చేతులెత్తాశాడు. మరో ఏడాదిపాటు సినిమా పట్టాలెక్కే పరిస్థితిని లేదని చెప్పారు. దాంతో మా నాన్న వ్యాపారానికి సహాయం అందించాలని భావించాను. వెంటనే సైకిల్‌పై కూరగాయల వ్యాపారం మొదలపెట్టాను. నా కుటుంబానికి సంబంధించిన, నాకు తెలిసిన పనిని చేయడంలో ఎలాంటి తప్పు లేదనిపించింది అని గౌర్ చెప్పారు.బాలీవుడ్‌లో సునీల్ శెట్టి, రణ్‌దీప్ హుడా, రాజ్‌పాల్ యాదవ్, మిలింద్ గునాజీ, యష్‌పాల్ యాదవ్ నటించిన చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఇప్పుడు ఓ భోజ్‌పురి, హిందీ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఆ సినిమా కోసం పనిచేస్తున్న సమయంలోనే లాక్‌డౌన్ విధించారు. నాకు ముంబైలో సొంత ఇల్లు ఉంది. త్వరలోనే ముంబైకి వెళ్లిపోతాను అని గౌర్ అన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox