Breaking News

కొడుకు విలన్ తండ్రికి కూడా విలన్ అయ్యాడు..!

20 th Nov 2020, UTC

టాలీవుడ్ :కరోనా లాక్ డౌన్ ముగిసిన తరువాత, ఇన్నాళ్ళకి తిరిగి షూటింగ్ లు మొదలవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. అయితే, ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఈ చిత్ర యూనిట్ కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఎట్టకేలకు "ఆచార్య" కు విలన్ దొరికాడు. నిన్నటి తరంలో హీరోగా నటించిన వ్యక్తిని "ఆచార్య" సినిమాలో విలన్ గా తీసుకోబోతున్నారట.

"రోజా" సినిమాతో బాగా పాపులర్ అయిన అరవింద్ స్వామి తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ లో విభిన్న పాత్రలను ఎంచుకుంటున్నారు. విలన్ పాత్రలకు కూడా అరవింద స్వామి వంద శాతం న్యాయం చేస్తున్నారు. రామ్ చరణ్ "ధ్రువ" సినిమాలో అరవింద్ స్వామి విలన్ గా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా, మెగాస్టార్ తో కూడా తెర పంచుకోబోతున్నాడు. 

అలా కొడుక్కి విలన్ గా నటించిన అరవింద్ స్వామినే తండ్రి సినిమాకి కూడా విలన్ గా ఎంపిక చేశారట. ఇప్పటికే పలువురుని ఈ పాత్ర కోసం పరిశీలించి చూసాక, ఫైనల్ గా అరవింద్ స్వామిని ఎంపిక చేశారట. వెండితెర పై చిరంజీవి, అరవింద్ స్వామికి మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా, పవర్ ఫుల్ గా ఉంటాయట. మరి వీరిద్దరి హీరో-విలన్ కాంబో తెర పై ఎంతవరకు పండుతుందో చూడాలి. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox