Breaking News

మరో నిర్మాతగా మారిన ఏఆర్ రెహమాన్..!

13 th Jun 2020, UTC
మరో నిర్మాతగా మారిన ఏఆర్ రెహమాన్..!

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ 99 సాంగ్స్‌’ చిత్రం ద్వారా  నిర్మాతగా మారారు. తాజాగా ఆయన ఇప్పుడు మరో చిత్రం నిర్మిస్తున్నారు. ‘నో ల్యాండ్స్‌ మ్యాన్‌’ టైటిల్ తో రూపొందుతున్న చిత్రానికి ఆయన  నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది యూఎస్‌–ఇండియా–బంగ్లాదేశ్‌ సినిమా. జాతిపరంగా విభజించబడిన ఈ ప్రపంచంలోని హానికర వ్యక్తులపై ఫోకస్‌ చేస్తూ సాగే చిత్రం ఇది.

 ఈ సినిమా నిర్మించాలనుకోవడానికి గల ముఖ్య కారణం గురించి రెహమాన్‌ చెబుతూ – కొత్త ప్రపంచంలో ఎప్పుడూ కొత్త సవాళ్లు ఉంటాయి. అందుకని కొత్త కథలు చెప్పడానికి కుదురుతుంది. ఈ చిత్రకథ అలాంటిదే. ఇప్పటి ప్రపంచానికి చెప్పాల్సిన కథ, ఇప్పటి సమయానికి తగ్గ కథ ఇది  అన్నారు.

ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన హిందీ నటుడు నవాజుద్దిన్‌ సిద్ధిఖీ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా నాకు ఓ సవాల్‌లా అనిపించింది. అయినప్పటికీ నటుడిగా సంతృప్తినిచ్చింది. ఏఆర్‌ రెహమాన్‌ ప్రతిభ ‘నో ల్యాండ్స్‌ మ్యాన్‌’ని గొప్ప సినిమాగా నిలబెడుతుంది’’ అన్నారు. ఈ సినిమా కథ విషయానికొస్తే... దక్షిణాసియాకి చెందిన ఓ వ్యక్తి జీవితం యూఎస్‌లో ఓ ఆస్ట్రేలియన్‌ యువతిని కలిశాక ఎంత సంక్లిష్టంగా మారిందనేది కథ

. ఆసిఫ్‌ మాండ్వి రాసిన ‘నో ల్యాండ్స్‌ మ్యాన్‌’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారని సమాచారం.   హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్‌ భాషల్లో సంభాషణలు ఉంటాయి. నిర్మాణానంతర కార్యక్రమాలను యూ ఎస్, ఇండియా, బంగ్లాదేశ్‌లో జరపాలనుకున్నాలాక్‌డౌన్‌ వల్ల ఆ పనులు ఆగాయి. బంగ్లాదేశ్‌ దర్శకుడు మొస్తోఫా సర్వార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox