Breaking News

పవన్ సినిమాలో అనసూయ..?

18 th Jan 2021, UTC
పవన్ సినిమాలో అనసూయ..?

ఓ వైపు బుల్లితెరను,మరో వైపు వెండితెరను మేనేజ్ చేసుకుంటున్న మోడరన్ యాంకర్ అనసూయకు మెగా హీరోలతో మంచి అనుబంధమే ఉంది. గతంలో ఆమె మెగా హీరోల సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ రంగస్థలంలోను, సాయి ధరమ్ తేజ్ తో విన్నర్ లో, వరుణ్ తేజ్ తో ఎఫ్ 2 సినిమాల్లో మెరిసింది అనసూయ. పెళ్లి, పిల్లలు, పర్సనల్ లైఫ్ లోని విషయాలేవీ కెరీర్ కి అడ్డం కావని ఈ ముద్దుగుమ్మ రుజువు చేస్తోంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో అనసూయ నర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు, మరో వైపు వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని, దర్శకుడు క్రిష్ తో సినిమా ను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోనే అనసూయను ఎంపిక చేశారని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏ పాత్ర అయినా అందులో అలవోకగా ఒదిగిపోయే అనసూయ పవర్ స్టార్ సినిమాలో కూడా మెరవబోతోంది. ఈ సినిమాలో ఓ పాటలో అనసూయ కనిపిస్తుందని తెలుస్తోంది.

వాస్తవానికి, అనసూయ గతంలోనే పవన్ సినిమా "అత్తారింటికి దారేది" లో ఐటెం సాంగ్ లో కనిపించాల్సి ఉంది. కానీ, అప్పట్లో గుంపులో గోవిందాలా తానూ ఉండలేనని అనసూయ తేల్చి చెప్పేసింది. పైగా, అప్పుడు గర్భంతో కూడా ఉండడంతో వద్దనుకుంది. అలా, అప్పుడు పోయిన అవకాశం మళ్ళీ వచ్చినట్లు తెలుస్తోంది. అని అనుకున్నట్లే జరిగితే, పవన్ సినిమాలో అనసూయ మెరుస్తుంది.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox