Breaking News

ఒక్కసారిగా పెరిగిపోయిన 'నాంది' కలెక్షన్స్.. ఏ రేంజ్ లో ఉన్నాయంటే..?

22 nd Feb 2021, UTC

టాలీవుడ్ :తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో అల్లరి నరేష్ ది ఎంతో ప్రత్యేకమైన శైలి. ఆయన తనదైన శైలిలో నవ్వించగలరు. ఏడిపించగలరు కూడా. ఇప్పటికే ఆయన పలు సినిమాల్లో సీరియస్ పాత్రను తీసుకుని ఏడిపించినప్పటికీ, ఆ జోనర్ లో ఎందుకనో కొనసాగలేదు. దీనితో వరుస పరాజయాలు చవిచూశారు. ఈ పరిస్థితుల్లో వచ్చిన మహర్షి సినిమాలో ఫ్రెండ్ గా చేసిన అల్లరి నరేష్ రోల్ అందరిని ఆకట్టుకుంది. తాజాగా, పూర్తి నిడివితో ప్రధాన పాత్రధారిగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో అల్లరి నరేష్ "నాంది" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా కాన్సెప్ట్, హీరోగా నటించిన అల్లరి నరేష్ ప్రతిభ, కధలోని సీరియస్ నెస్ అన్ని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. వెరసి, ఈ సినిమా లాభాల బాట పట్టింది. క్రైం థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్ర పోషించారు. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న అల్లరి నరేష్ ను బయటకు తీసుకురావడంలో వరలక్ష్మి ఎదుర్కొన్న అడ్డంకులేంటి? బయటకు వచ్చిన తరువాత అల్లరి నరేష్ తనను శిక్షించిన వారికి ఎలాంటి గుణపాఠం చెప్పాడు? అన్న జోన్ లో ఈ సినిమా సాగుతుంది.

ప్రేక్షకులకు బాగా నచ్చడంతో కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. మొదటి రోజు కలెక్షన్ల ప్రకారం, ఆంధ్రలో 1.20 కోట్లు, సీడెడ్ రూ. 30 లక్షలు, నైజాం రూ. కోటి, ఓవర్సీస్ రూ. 20 లక్షలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నాంది సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే, మొదటి మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో 2.14 కోట్లు షేర్, రూ. 3.86 కోట్లు గ్రాస్ అందుకున్న నాంది ఓవర్సేస్ లో ఎనిమిది లక్షల వరకు రాబట్టింది. ఓవరాల్ గా, రూ. 2.28 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ మూడు కోట్లుగా ఉంది. మరో డెబ్భై రెండు లక్షలు కలెక్ట్ అయితే "నాంది" హిట్ చిత్రంగా నిలవనుంది. ఇప్పటికే ఈ సినిమాకి మంచి టాక్ రావడంతో తొందరలోనే ఈ సినిమా ఆ టార్గెట్ ను చేరి హిట్ అవ్వనుంది. మరిన్ని వార్తలు చదవండి

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox