Breaking News

గూఢచారి 2 కు సిద్దమవుతున్న అడివి శేషు

27 th May 2022, UTC
గూఢచారి 2 కు సిద్దమవుతున్న అడివి శేషు

Tollywood: నటుడు అడివి శేషు మేజర్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రంపై మంచి అంచనాలు వున్నాయి. మహమ్మారి కారణంగా అడవి శేషు ఈ సినిమా విడుదల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం అతను మేజర్‌ని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నాడు. జూన్ 3న మేజర్ సినిమా విడుదల అవుతుంది. 

మేజర్ సినిమా విడుదల తర్వాత అడవి శేషు గూఢచారి 2పై తన దృష్టిని పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీనిపై రెండేళ్ల క్రితమే అధికారిక ప్రకటన వచ్చింది. ప్రాజెక్ట్‌కు రాహుల్ పాకాల దర్శకత్వం వహిస్తారు. త్వరలోనే అడివి శేషు బృందం స్క్రిప్ట్ సెషన్స్‌లో పాల్గొంటారు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. గూఢచారి 2 కు అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తారు. త్వరలో నటీనటులు, సిబ్బందిని ఖరారు చేయనున్నారు. 

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ ప్రతిష్టాత్మక సీక్వెల్‌ను నిర్మించనున్నాయి. చిత్రంలో అధిక భాగం విదేశాలలో చిత్రీకరించబడుతుంది. నిర్మాతలు గూడచారి 2 కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించారు. శ్రీచరణ్ సంగీతం అందిస్తారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox