Breaking News

కరాటే కల్యాణి, యూట్యూబర్ మధ్య గొడవ.. ఒకరి పై ఒకరు దాడిచేసుకుని పోలీసులకు ఫిర్యాదు

13 th May 2022, UTC

Hyderabad: ప్రముఖ సినీనటి కరాటే కల్యాణి యూట్యూబర్‌ శ్రీకాంత్‌ రెడ్డి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఎస్సార్ నగర్ పరిధిలోని మధురానగర్‌లో ఈ  ఘటన జరిగింది. అనంతరం ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఒకరి పై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మహిళలపై అసభ్యకరంగా ప్రాంక్ వీడియోలు చేస్తున్నాడనే కోపంతో దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ దాడిలో శ్రీకాంత్‌ రెడ్డికి గాయాలయ్యాయి. ఈ గొడవలో ఆమెతో పాటు మరో వ్యక్తి ఉన్నాడు.

అతని వీడియోల్లో మహిళలను తక్కువ చేసి చూపుతున్నాడని, ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తున్నాడని కరాటే కల్యాణి ఆరోపించారు. అందుకే అతణ్ని కొట్టినట్లు వివరించారు. అయితే, కల్యాణి శ్రీకాంత్ రెడ్డిని చెంపదెబ్బ కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. తొలుత రోడ్డుపై వీడియోలు తీసుకుంటున్న అతని దగ్గరికి కరాటే కల్యాణి వచ్చి చెంపదెబ్బ కొట్టింది. తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఆమెను తిరిగి కొట్టడంతో గొడవ మరింత ఎక్కువ అయింది. నడి రోడ్డుపైనే ఈ రచ్చ రచ్చ జరగడంతో చుట్టుపక్కల వారు గుమిగూడారు. ఇంతలో ఆమె వెనకాలే ఉన్న మరో వ్యక్తి వేగంగా వచ్చి శ్రీకాంత్ చెంప పగలగొట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి గురైన శ్రీకాంత్ కరాటే కల్యాణిపై చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో కరాటే కల్యాణి ఓ పసి బిడ్డను ఎత్తుకుని ఉన్నారు. ఈ గొడవలో శ్రీకాంత్ రెడ్డి చొక్కా చిరిగిపోయింది. 

కరాటే కల్యాణి తనకు కొట్టినందుకు కారణం తాను ఆమె అడిగిన డబ్బులు ఇవ్వనందుకే అని యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి వాదించారు. తనను రూ.లక్ష అడిగిందని, తాను ఇవ్వను అన్నందుకే ఇలా దాడికి పాల్పడిందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. తాను ప్రాంక్ షూట్స్ చేస్తే ఆమెకేంటి ఇబ్బంది అని ప్రశ్నించారు. మధ్యలో మరో వ్యక్తి వచ్చి ఆమెకు రూ.70 వేలు ఇవ్వాలని మధ్యవర్తిత్వం వహించినట్లుగా శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox