Breaking News

ధోనీ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య..!

14 th Jun 2020, UTC

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబైలోని తన నివాసంలో ఆదివారం అతడు ఉరి వేసుకున్నాడు. 
ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎమ్మెస్ ధోనీ సినిమా సుశాంత్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ధోనీ పాత్రలో సుశాంత్ నటన అందర్నీ మెప్పించడంతో పాటు పలు అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. తొలుత టీవీ సీరియల్స్‌ ద్వారా గుర్తింపు పొందిన అతడు ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘కాయ్‌పోచే’, ‘కేథార్‌నాథ్‌’, ‘రాబ్బా’,‘పీకే’ వంటి హిట్‌ చిత్రాలలో నటించాడు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కొన్నాళ్లుగా డిప్రెషన్ తో బాధపడుతూ దానికి అతడు ట్రీట్ మెంట్ కూడా తీసుకుంటున్నాడు. అంతలోనే ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ కలిచివేస్తోంది. అతడు నటించిన ఆఖరి చిత్రం డ్రైవ్ గతేడాది రిలీజైంది. ఈ ఏడాది ఓ సినిమాలో అతడు హీరోగా నటిస్తున్నాడు. అదింకా షూటింగ్ స్టేజ్ లో ఉంటుండగానే ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డాడు సుశాంత్. సుశాంత్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

ఇటీవల  లాక్‌డౌన్ కార‌ణంగా ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న ప‌లువురు‌ టెక్నీషియ‌న్లు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.  
మరో వైపు  బాలీవుడ్. ఇర్ఫాన్ ఖాన్, రిషీకపూర్, వాజిద్ ఖాన్ మరణాల నుంచి బాలీవుడ్ ఇంకా తేరుకోక ముందే సుశాంత్ ఆత్మహత్య ఓ షాక్ లా తగిలింది.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox