Breaking News

ప్రముఖ నటుడు కమలహాసన్ కు సర్జరీ..!

19 th Jan 2021, UTC
ప్రముఖ నటుడు కమలహాసన్ కు సర్జరీ..!

చెన్నై :ప్రముఖ నటుడు కమలహాసన్ కు  చెన్నైలోని శ్రీరామ‌చంద్ర మెడిక‌ల్ సెంట‌ర్ లో వైద్యులు  సర్జరీ చేసారు. కాలికి గాయం అవడంతో సర్జరీ చేయాల్సి వచ్చింది. కమల్ హాసన్ ఆరోగ్యం పై శ్రీ రామ చంద్ర మెడికల్ సెంటర్ హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. కమల హాసన్ కుడి కాలు ఎముకకు స్వల్పంగా ఇన్ఫెక్షన్ అవడంతో  శ్రీరామ‌చంద్ర మెడిక‌ల్ సెంట‌ర్ లో చేరారు. ఆయనకు సర్జరీ చేసి ఇన్ఫెక్షన్ ను తొలగించినట్లు తెలిపారు.

ప్రస్తుతం, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. ఆయన కోలుకుంటున్నారని వైద్యులు వివరించారు. తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా కమల హాసన్ ఈ ఎన్నికల పైనే దృష్టి నిలిపారు. ఇప్పటికే పలు చోట్ల ప్రచారం సైతం నిర్వహించుకుంటూ వచ్చారు. కమల్ హాసన్ తన పార్టీలో అభ్య‌ర్థుల ఎంపిక‌, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ వంటి విషయాలకు సంబంధించి ప్రణాళికలు వేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox