Breaking News

సోనూసూద్ ని సత్కరించిన ఆచార్య టీం!

21 st Nov 2020, UTC
సోనూసూద్ ని సత్కరించిన ఆచార్య టీం!

టాలీవుడ్ :కరోనా లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ విలన్ సోనూసూద్ ఎందరో వలస కార్మికులకు హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నుంచి సోనూసూద్ ఎందరికో సాయం చేసాడు. చేస్తూనే ఉన్నాడు. ఇంకా చేస్తూనే ఉంటానని మాటిచ్చాడు. అతని మంచితనంతో సోను సూద్ దేశవ్యాప్తంగా రియల్ హీరో అయిపోయాడు. ఎందరో వలస కార్మికులను సొంత ఖర్చులతో వారి వారి స్వస్థలాలకు చేర్చాడు.
 
ఎందరో పేదల పాలిట దేవుడిగా నిలిచాడు. ప్రస్తుతం ఆయన ఎక్కడకి వెళ్లిన అందరు అభిమానంతో ఆయన్ను ఆదరిస్తున్నారు. అతని మంచితననానికి సన్మానాలు చేస్తున్నారు. తాజాగా, సోనూసూద్‌ను ఆచార్య సినిమా షూటింగ్ సెట్స్‌లో దర్శకుడు శివ కొరటాల, నటుడు తనికెళ్ల భరణి కూడా సత్కరించారు. ఆయనకు ఒక శాలువా కప్పి, హనుమంతుడి ప్రతిమను అందించారు. ఇటీవల చిరంజీవి హీరోగా రూపొందుతున్న "ఆచార్య" సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. ఈ షూటింగ్ సెట్ లోనే సోనూసూద్ కి సన్మానం చేసారు. సోనూసూద్ లాక్ డౌన్ తరువాత కూడా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. పేదలకు, రైతులకు, విద్యార్థులకు సోనూసూద్ సాయం అందిస్తూ వస్తున్నారు. ఈ వివరాలను ఆయన ట్విట్టర్ మధ్యముఖంగా పంచుకుంటున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox