Breaking News

టాలీవుడ్ ప్రముఖ విలన్ కు మాతృవియోగం..!

15 th Sep 2020, UTC
టాలీవుడ్ ప్రముఖ విలన్ కు మాతృవియోగం..!

టాలీవుడ్ :టాలీవుడ్ ను వరుస మరణాలు విషాదంలో ముంచెత్తుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే, విలక్షణ నటుడు, కమెడియన్ జయప్రకాశ్ రెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్రముఖ నిర్మాత, టాలీవుడ్ విలన్ అశోక్ కుమార్ కు మాతృ వియోగం కలిగింది. దీనితో ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు.

అశోక్ కుమార్ తల్లిగారు కె. వసుంధరాదేవి సోమవారం మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని నివాసంలో కన్నుమూశారు. అశోక్ కుమార్ విలక్షణ నటుడు. ఆయన ఎన్నో సినిమాలను నిర్మించి, నటించి మెప్పించాడు. ఆయన కోడి రామకృష్ణ దర్శకత్వంలో "భారత్ బంద్" సినిమాతో తెరంగ్రేటం చేసాడు. ఓవర్ నైట్ లో ఆయన ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

ఆ తరువాత విలన్ క్యారెక్టర్లను అలవోకగా పండించేవారు. నటనకంటే ముందుగా ఆయన నిర్మాతగా సుపరిచితుడు. 'రక్త తిలకం', 'ధృవ నక్షత్రం', 'చెవిలో పువ్వు', 'ప్రేమంటే ఇదేరా', 'ఈశ్వర్' 'జయదేవ్' వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద అప్పట్లోనే మంచి విజయాలను సాధించాయి. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox