Breaking News

వంటరి తనం... డిప్రెషన్ ఇవే బలితీసుకున్నాయా?

14 th Jun 2020, UTC
వంటరి తనం... డిప్రెషన్   ఇవే బలితీసుకున్నాయా?

తన నటనతో అందరినీ ఆకట్టుకున్న బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆకస్మిక మరణం అందరినీ కలిచివేస్తోంది. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే సుశాంత్‌ సింగ్‌ జూన్‌ 3న చివరి సారిగా తన తల్లిపై ఇన్ స్టాగ్రామ్ లో కవితాత్మక పోస్ట్‌ ఒకటి పెట్టాడు. ఇప్పుడు ఆ పోస్టు హాట్ టాపిక్‌గా మారింది. 'మసకబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది. అనంతమైన కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్యా బతుకుతున్నా' అని పోస్టులో రాశారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన తల్లిని గుర్తు చేసుకుంటూ పెట్టిన పోస్ట్ అందరినీ భావోద్వేగానికి లోను చేస్తోంది. తన తల్లి ఫోటోను కూడా అతడు ఇన్ స్టాలో షేర్ చేశాడు. సుశాంత్ తల్లి 2002లో మరణించారు.

సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు వీటన్నింటికి సంబంధించి సమాచారం తరుచుగా సేకరించేవాడు. శని గ్రహం కదలికలు పరిశీలించడం అతనికి ఎంతో ఇష్టంగా వుండేది.  శివుడి భక్తుడయిన సుశాంత్ తరచుగా సోషల్ మీడియాలో శివుడి గొప్ప తనంపైనా , ఓమ్ శబ్దం ప్రాదాన్యత పైనా సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టేవాడు.  మియడ్  14 ఎల్ ఎక్స్ 600 పేరుతో అత్యంత అధునాతనమైన ఖరీదైన టెలిస్కోప్ ను కొని ఆ విషయాన్ని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసాడు. ప్రపంచంలోనే అడ్వాన్స్ డ్ టెలిస్కోప్ ను కొన్నానని దీనితో శని గ్రహం కదలికలను పరిశీలిస్తానని అన్నాడు.

 సుశాంత్ ఒక ఫ్లయిట్ సిములేటర్ ను కూడ కొన్నాడు. ఇది పైలట్ ట్రయినింగ్ లు ఇవ్వడానికి ఉపయోగించే వాడు . స్వతహాగా బైకులంటే ఇష్టపడే సుశాంత్ రాజ్ పుట్ వద్ద బిఎండబ్ల్యు కె 1300 ఆర్ మోటార్  సైకిల్ వుంది. అంతేకాదు లగ్జరీ స్పోర్ట్స్ కార్  మసేరాటి క్వాట్రొపోర్ట్ , లాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్ యు వి కూడ వున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుట్  ఒక సినిమాకు రూ.5 నుంచి 7 కోట్లు దాకా తీసుకునే వాడు. అతని ఆస్తి విలువ సుమారుగా రూ.59 కోట్లు దాకా వుంటుంది. చంద్రమండలం మీద స్దలం కొన్న ఏకైక నటుడు అతనే. అతనికన్నా ముందు షారూక్ ఖాన్ కు ఒక అభిమాని  చంద్రుడి మీద స్దలాన్ని బహుమతిగా ఇచ్చాడు.

స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ బయోపిక్‌లో టైటిల్ క్యారెక్టర్‌లో నటించిన సుశాంత్ సింగ్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. కేరీర్ అత్యున్నత స్థితిలో కొనసాగుతోందిఈ పరిస్థితుల్లో ఆయన ఆత్మహత్య చేసుకోవడం పట్ల అందరూ షాక్ కు గరయ్యారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. బిహార్‌కు చెందిన సుశాంత్ సింగ్.. ఇప్పటిదాకా 12 సినిమాల్లో నటించారు. ఎంఎస్ ధోనీ తరువాత ఆయన నటించిన అన్ని సినిమాలూ . ఆయనకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టాయి.సుశాంత్ సింగ్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కై పో ఛె. ఇందులో ఇషాన్ భట్‌గా నటించారాయన. తొలి సినిమాతోనే జీ సినీ అవార్డును అందుకున్నారు. ప్రతిష్ఠాత్మక ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యారు. అనంతరం శుద్ధ్ దేశీ రొమాన్స్‌లో నటించారు. 2014లో అమీర్ ఖాన్ నటించిన పీకే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించారు.ఆ మరుసటి ఏడాది డిటెక్టివ్ బ్యోమ్‌కేశ్ బక్షిలో నటించారు. అది హిట్ కానప్పటికీ.. అవకాశాలను తగ్గలేదు. ఆ మరుసటి ఏడాదే ఎంఎస్ ధోనీ బయోపిక్‌లో నటించారు. అనంతరం రాబ్తా, వెల్‌కమ్ టు న్యూయార్క్, కేదార్ నాథ్, ఛిఛ్చోరేలతో బిజీ అయ్యారు.


 కొన్నిరోజుల క్రితం సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియా కూడా ఆత్మహత్య చేసుకుంది.దిశ ఆత్మహత్య చేసుకోవడం సుశాంత్ సింగ్‌ను తీవ్రంగా కలవరపాటుకు గురి చేసిందనేది బాలీవుడ్ టాక్. దిశ ఆత్మహత్యపై ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారని అంటున్నారు. దిశ ఆత్మహత్య చేసుకోవడాన్ని సుశాంత్ సింగ్ జీర్ణించుకోలేకపోయారని సన్నిహితులు చెబుతున్నారు. ఆ ఘటన తరువాత అతను ముభావంగా ఉండేవాడని సమాచారం. ఆ ఘటనపై దర్యాప్తులో భాగంగా పోలీసులు సుశాంత్ ను కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు సుశాంత్ కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసును సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు

బాలీవుడ్ యువనటి అంకిత లోఖండేతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ రిలేషన్‌షిప్ కొనసాగింది. సుమారు ఆరేళ్ల పాటు ఇద్దరు సన్నిహితంగా గడిపారని బాలీవుడ్ ప్రముఖులు చెబుతున్నారు. 2010లో ఆయన టెలివిజన్ షోలల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచీ 2016 వరకూ అంకిత లోఖండేతో రిలేషన్‌ షిప్ కొనసాగించారని అంటున్నారు. ఇద్దరి మధ్య బ్రేకప్ తరువాత సుశాంత్ సింగ్ పూర్తిగా సినిమాలు, కేరీర్‌పైనే దృష్టి సారించారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox