Breaking News

జర్నలిస్టు పాత్రలో షారూక్ ఖాన్..!

07 th Jun 2020, UTC
జర్నలిస్టు పాత్రలో షారూక్ ఖాన్..!

ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌  జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ అనే చిత్రం తెరకెక్కుతోంది.ఇందులో హీరో మాధవన్ నంబి నారాయణన్‌  పాత్రలో నటించి, దర్శకత్వం వహించారు .జర్నలిస్ట్‌గా కనిపించబోతున్నారు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌ జర్నలిస్టు పాత్ర పోషిస్తున్నారు. . నంబి నారాయణన్‌ని ఓ జర్నలిస్ట్‌ ప్రశ్నలు అడిగే సన్నివేశంతో ‘రాకెట్రీ’ సినిమా మొదలై, ఆ తర్వాత ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌కి వెళుతుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌  పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు.

  ఇస్రోకు చెందిన సీనియర్ సైంటిస్ట్ నారాయణన్  రాకెట్ల డిజైన్లకు సంభందించి కీలక రహస్యాలను విదేశాలకు చేరవేసారనే  ఆరోపణలపై ఆయనపై కేసులు నమోదు చేసారు. దేశమంతా సంచలనం సృష్టించిన ఈ కేసులో పదేళ్ల పాటు నారాయణన్ ఒంటరి పోరాటం చేసారు. చివరకు సుప్రీంకోర్టు ఆయనపై కేసు కొట్టివేయడం తో పాటు ఆయనకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.   ఈ కధతో ఇపుడు సినిమా  రూపొందిస్తున్నారు.

  దక్షిణాది ప్రేక్షకులకు పరిచితమైన మాధవన్ టైటిల్ రోల్ పోషించడం, ఇపుడు షారూక్ ఖాన్ ఇందులో జర్నలిస్టు పాత్ర పోషిస్తారని తెలియడంతో దీనిపై సహజంగానే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. షారుక్‌ నటించిన గత చిత్రం ‘జీరో’లో మాధవన్‌  సైంటిస్ట్‌గా నటించిన సంగతి తెలిసిందే.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox