Breaking News

టాలీవుడ్ నిర్మాత కు చుక్కలు చూపించిన రియా..!

15 th Sep 2020, UTC

టాలీవుడ్ :బాలీవుడ్ నటి రియా చక్రవర్తి తొలుత తెలుగు సినిమా ద్వారానే వెండితెరకు పరిచయం అయింది. ఇపుడు సుశాంత్ ఆత్మహత్య, డ్రగ్స్ కేసు వ్యవహారంలోను కీలక వ్యక్తి గా ఉన్న రియా సినీరంగం పరిచయం లేని వారికి తెలిసిపోతోంది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో మరింతగా వార్తల్లోకెక్కిన రియా తెలుగు సినీ నిర్మాతకు చుక్కలు చూపించిందట.

ప్రస్తుతం ఆమె కెరీర్ అత్యంత వివాదంలోకి మారిన సంగతి తెలిసిందే. ఈ వివాదం మొదలైన తొలినాళ్లలో కూడా ఆమె తెలుగు సినిమా "సూపర్ మచ్చి" లో నటించిందట. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి నిర్మాతలు ఎట్టకేలకు ఆమెను తప్పించేశారట. కానీ ఆమెను తప్పించడానికి అసలు కారణం వేరే ఉంది. ఎం ఎస్ రాజు నిర్మాణంలో, దిల్ రాజు మాగంటి రామచంద్రన్ రూపొందించిన తూనీగ తూనీగ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా రియా ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.

తొలి తెలుగు సినిమా చేసిన చాలా ఏళ్ల తరువాత మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ సినిమా "సూపర్ మచ్చి" సినిమాతో ఆమె తిరిగి తెలుగు సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే, పులి వాసు దర్సకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కన్నడ హీరోయిన్ రచితా రామ్ కూడా నటిస్తున్నారు. మరో హీరోయిన్ గా రియా నటిస్తున్నారు. అయితే, లాక్ డౌన్ కి ముందే కళ్యాణ్ దేవ్ కు రియా కు మధ్య కొన్ని సన్నివేశాలు తీసారట. ఆ తరువాత షూటింగ్ వాయిదా పడింది. తిరిగి వచ్చి నటించడానికి రియా అంగీకరించలేదట. డేట్ ల విషయంలో రియా పేచీ పెట్టారని తెలుస్తోంది. 70 రోజుల కాల్షీట్లు ఇచ్చానని, అవి పూర్తి అయిపోయాయని వాదిస్తున్నారట. అయితే రియా వేధిస్తుండడంతో టాలీవుడ్ కు చెందిన అగ్రహీరోలు, ఓ బడా నిర్మాత కూడా రంగంలోకి దిగి ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారట. అయినా సరే రియా ససేమిరా అనడంతో, ఈ సినిమా నుంచి ఆమెను తప్పించేసి, మరో కొత్త హీరోయిన్ ను చూస్తున్నారట. ఈ లోపు సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం. ఆమె డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం వంటి పరిణామాలు జరిగాయి. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox