Breaking News

కరోనాను గాలికొదిలేసి సచివాలయం పై 11 గంటల సమీక్షా.. సీఎం కేసీఆర్ పై మండిపడ్డ రేవంత్ రెడ్డి

01 st Aug 2020, UTC

హైదరాబాద్ : కరోనా కాలంలో సీఎం కేసీఆర్ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కల్లోలంతో ప్రజలు చస్తున్నా, కోర్టులు తిడుతున్నా, నిపుణులు హెచ్చరిస్తున్నా సీఎంకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు.

ఎవడి పిచ్చివాడికి ఆనందమన్నట్లుగా కేసీఆర్ వైఖరి ఉందన్నారు. కరోనా సమస్యను గాలికి వదిలేసి సచివాలయంపై 11గంటలు సుదీర్ఘ సమీక్ష చేయడం సీఎం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అని పేర్కొన్నారు.  

కేసీఆర్ పై విహెచ్ సెటైర్లు

ఆంధ్రా సీఎం జగన్ ఏపీలో మూడు రాజధానులు చేస్తుండగా, తెలంగాణలో కేసీఆర్ రెండు రాజధానులు  సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావుసెటైర్లు వేశారు. ఏపీలో మూడు రాజధానుల బిల్లుకు ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూజగన్ దారిలోనే కేసీఆర్ కూడా నడుస్తారనిపిస్తోందని వ్యాఖ్యానించారు. 

ఆయన మూడు రాజధానులు చేయగా తాను రెండు రాజధానులు ఎందుకు చేయొద్దని కేసీఆర్ ఆలోచిస్తారని కేసీఆర్ తీరును ఎద్దేవా చేశారు. 

కేసీఆర్‌కు కలిసొచ్చే విధంగా కరీంనగర్‌ను రెండో రాజధానిగా చేస్తారేమో అని అన్నారు. కొత్తదనం కోరుకునే కేసీఆర్‌కు కచ్చితంగా రెండో రాజధాని ఆలోచన వస్తుందనిపిస్తోందని వీహెచ్ పేర్కొన్నారు. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox