Breaking News

ఓటిటీలు రారమ్మన్నా టెంప్ట్ అయ్యే ఛాన్స్ లేదు..!

16 th Sep 2020, UTC

టాలీవుడ్ :ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు మూత పడ్డ సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికే షూటింగ్ లు పూర్తి చేసుకున్న సినిమాలు ఓటిటిలలో రిలీజ్ చేసేస్తున్నారు. మరో వైపు కొన్ని సినిమాలు మాత్రం ఓటిటిలలో విడుదల చేయడానికి అంగీకరించడం లేదు. థియేటర్లలోనే విడుదల చేస్తామని ఖరాకండిగా చెప్పేస్తున్నాయి. ఆ సినిమాల జాబితాలో "రెడ్" సినిమా కూడా చేరింది.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ హీరోగా రామ్ ఇరగదీసిన సంగతి తెలిసిందే. తాజాగా రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో "రెడ్" సినిమా చేస్తున్నాడు. నివేతా పెతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. ఇప్పటికే కరోనా కారణంగా చాలా సినిమాలు ఓటిటిలో విడుదల అయిపోయిన సంగతి తెలిసిందే. నాని, సుధీర్ బాబుల "వి" సినిమాను కూడా దిల్ రాజు ఓటిటిలో విడుదల చేసేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలో రామ్ "రెడ్" సినిమాకి కూడా ఓటిటి లు భారీగానే ఆఫర్ లు ఇస్తున్నాయట. అయితే రామ్ మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నాడట. ఓటిటిలు ఎంత ఆఫర్ చేసినా తాను మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నాడు. అస్సలు టెంప్ట్ అయ్యే ఛాన్స్ లేదని అంటున్నాడు. ఎంతకాలం అయినా వెయిట్ చేసి సినిమాను థియేటర్ లోనే విడుదల చేస్తానని రామ్ స్పష్టం చేసాడు. "ఇస్మార్ట్ శంకర్" తరువాత రామ్ పై భారీగానే అంచనాలు పెరిగాయి. సో ఈ సినిమా కూడా ఆ స్థాయిలోనే ఉంటుందని భావిస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox