ఎన్టీఆర్ నటించిన జగదేకవీరునికథలోని శివశంకరీ పాటను ఘంటసాల అద్భుతంగా పాడారు. ఆ పాటలోని మ్యాజిక్‌ను మళ్లీ క్రియేట్ చేయడానికి ప్రముఖ గాయకులు కూడ ఆలోచిస్తారు. అయితే ఎన్టీఆర్ తనయుడు బాలయ్య మాత్రం ఆ సాహసం చేశాడు. శివశంకరీ పాటను పాడేసి యూ ట్యూబ్ లో పెట్టేసాడు.
ఆ మధ్యన ఒక సినిమా ఫంక్షన్లో బాలకృష్ణ వీరావేశంగా "నీ కంటి చూపుల్లోన" పాట పాడగా అది ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.
పూరీ జగన్నాథ్ సినిమా పైసా వసూల్లో ‘మామ ఎక్ పెగ్ లా' పాటని అతి కష్టం మీద ట్యూన్ చేసినట్టు కనిపిస్తుంది. అయితే అది తాగుబోతుల సాంగ్ కాబట్టి ఎలా పాడినా నడిచింది. కానీ శివ శంకరి పాట అలా కాదు. ఆ పాట పాడి మరోసారి బాలయ్య విమర్శలపాలయ్యాడు.
బాలయ్య పాటపై ఆర్జీవీ స్పందించాడు. ‘వావ్ మహమ్మద్ రఫీ, ఎస్పీబీ కూడా పాడటంలో జూనియర్లే. ఆయన పాడి పాట, ఆ స్వరాల, ఆ శబ్దాలు వింటే శ్రోతల హృదయ స్పందన పెరుగుతుంది. ఒతెల్లో బల్లాడ్ శంకర శాస్త్రి మోజార్ట్‌ల కలయికలా ఉంద'ని ట్వీట్ చేశాడు.
తాజాగా వర్మ స్పందిస్తూ.. ‘తన కామెంట్లను కొంతమంది చెడ్డవారు జోక్ చేశానని అంటున్నారు కానీ దేవుడు, బాలయ్య మీద ఒట్టేసి చెబుతున్నా.. సంగీతం కనుగొన్నప్పటి నుంచి నేటి వరకు విన్న పాటల్లో ఇదే గొప్ప పాట. నాకు తెలిసి స్వర్గంలోని ఎన్టీఆర్ కూడా సంతోషంతో గంతులు వేస్తుంటారు'అని మరో ట్వీట్ చేశాడు.
జనసేన నేత నాగబాబు ట్విట్టర్లో చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఒక్కోసారి ఓల్డ్ సాంగ్స్ రీమిక్స్ కన్నా ఒరిజనల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ తరానికి ఘంటసాల గాత్ర మాధుర్యం విలువ ఈ పాటికే తెలిసుంటది అని బాలకృష్ణ పాడిన శివశంకరీ పాటను ఉద్దేశించి కామెంట్ చేశారు

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
17 Jan 2021
16 Jan 2021
18 Jan 2021
18 Jan 2021
18 Jan 2021
19 Jan 2021