Breaking News

పూరీ -మహేష్ కాంబో రిపీటవుతుందా?

11 th Jun 2020, UTC
పూరీ -మహేష్ కాంబో రిపీటవుతుందా?

ఇస్మార్ట్ శంకర్`తో తిరిగి  దర్శకుడు పూరీ జగన్నాథ్  పూర్తి ఫామ్ లోకి వచ్చేసాడు. తాను తన హీరోని , హీరోయిన్లని ఎలా చూపించాలనుకుంటాడో అందులో పూరీ రాజీపడడు. దానికి తోడు స్వతహాగా మంచి రైటర్ అయిన పూరీ తన చిత్రాలకు తానే కధ, మాటలు తయారు చేసుకుంటాడు. ఇవి అతని చిత్రాలకు పెద్ద ప్లస్ పాయింట్లు. అసలు పూరీని డైరక్టర్ కన్నా రైటర్ గా అభిమానించే వాళ్లు కూడ ఎక్కువగా వున్నారు. అది వేరే సంగతి.

టాలీవుడ్ లో వేగంగా సినిమాలను పూర్తి చేసే దర్శకుడు ఎవరైనా వున్నారంటే తను పూరీ జగన్నాధే. ఒక సినిమా పూర్తవుతుండగనే మరో సినిమాకు కధ , తారాగణం ఎంపికలో పడిపోతాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయి రిలీజ్ అవగానే మరో సినమాకు శ్రీకారం చుడతాడు. ఇపుడు కూడ అదే తరహాలో లేటెస్ట్  స్క్రిప్టును సిద్ధం చేశాడట.
ప్రస్తుతం యంగ్ హీరో విజయ్ దేవరకొండతో `ఫైటర్` సినిమాను రూపొందిస్తున్న పూరీ విరామ సమయంలో `జనగనమణ` కథను పూర్తి చేశాడట.

ఈ సినిమాను మహేష్‌తో చేయాలని గతంలో పూరీ అనుకున్నాడు. అయితే  మహేష్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని వార్తలు వచ్చాయి. దానితో ఇద్దరి మధ్య గ్యాప్  కూడ పెరిగింది. తాను మహేష్ కు  పోకిరి, బిజినెస్ మేన్ వంటి సూపర్ హిట్లు ఇచ్చినా మహేష్ తనకు సరైన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వలేదన్న ఫీలింగ్ పూరీలో వుంది. అందుకే తనకు మహేష్ బాబు కన్నా మహేష్ అభిమానులంటే ఇష్టం అని కూడ ఒక ఇంటర్వూలో చెప్పేసాడు

అయితే  సినిమా, రాజకీయ రంగాల్లో పరిస్దితులు ఎపుడు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేరు..ఇటీవల మహేష్ సోషల్ మీడియా లైవ్‌లో ఓ అభిమాని ప్రశ్నకు స్పందిస్తూ.. `పూరీ కథ ఎప్పుడు చెబుతారా? అని వెయిట్ చేస్తున్నా` అని చెప్పారు.  అంటే తనకు పూరీ డైరక్షన్ లో చేయాలని చెప్పకనే చెప్పాడు. అందువలన  మహేష్ , పూరీ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox