Breaking News

నారప్ప సినిమాలో ప్రియమణి లుక్ రిలీజ్..!

05 th Jun 2020, UTC
నారప్ప సినిమాలో ప్రియమణి లుక్ రిలీజ్..!

వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో త‌మిళ సినిమా అసుర‌న్‌కి రీమేక్‌గా  'నారప్ప' పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ సినిమా 'అసురన్’కు రీమేక్‌గా వస్తోంది. తమిళంలో ధనుష్ నటించిన ఆ సినిమా  మంచి హిట్ సాధించింది. వెట్రిమార‌న్ తెర‌కెక్కించిన ఈ సినిమా అక్కడ దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసిందని టాక్. తెలుగులో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తోండగా ఆయనకు జంటగా ప్రియమణి నటిస్తోంది.

ప్రియ‌మ‌ణి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నార‌ప్ప చిత్రం నుండి ఆమె లుక్ విడుద‌ల చేశారు. ఇందులో ఎడ్లబండిపై కూర్చొని ఉన్న ప్రియ‌మ‌ణి ప‌ల్లెటూరి యువ‌తిలా క‌నిపిస్తుంది. ఆమె లుక్ ఫ్యాన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. తమిళ్‌లో ఈ సినిమా హత్తుకునే భావోద్వేగాలతో గ్రామీణ నేపథ్యంలో సాగుతూ హృదయాలను కట్టిపడేసింది.

 తెలుగులో కూడా ఈ సినిమాను ఎక్కడా తగ్గకుండా రూపొందించాలని భావించిన దర్శక నిర్మాతలు సినిమాకు సంబందించి కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరిస్తున్నారు.  మలయాళ నటి రెబ్బా మోనిక జాన్ నటించనుంది. మ‌ణిశ‌ర్మ చిత్రానికి సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox