Breaking News

బాలు ని బతికించాలని ప్రార్ధనలు చేస్తున్న : కె ఏ పాల్

24 th Aug 2020, UTC

టాలీవుడ్ :గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. ఎస్పీబీ ఆసుపత్రిలో వెంటిలేటర్, ఎక్మో సపోర్ట్ పై చికిత్స
తీసుకుంటున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందంటూ వార్తలు వస్తుండడంతో అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు. బాలు ఎలా అయినా కోలుకుని తిరిగి రావాలని, తిరిగి పాటలు పాడాలని అందరు కోరుకుంటున్నారు.

అయితే, ఆయన కోలుకునే విషయమై కెఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యల ద్వారా క్రైస్తవ మత ప్రచారకుడు కె ఏ పాల్ వార్తల్లో నిలిచారు. చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాల సుబ్రహ్మణ్యం ప్రాణాలను కాపాడాల్సిందిగా తనకు కాల్స్ వస్తున్నాయని కె ఏ పాల్ అన్నారు. ఆయన ప్రాణాలను కాపాడేందుకు తానూ కూడా ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నానని అన్నారు. లార్డ్ జీసెస్ ఆయన ప్రాణాలను తప్పకుండ కాపాడుతారని అన్నారు. గతంలోకూడా ఎవరెవరి ప్రాణాలు కాపాడారో వివరాలు చెప్పుకొచ్చారు. ఎస్పీబీ  కూడా తిరిగి పూర్తి ఆరోగ్యంతో బయటకొస్తారని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో ను విడుదల చేసారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox