Breaking News

వెబ్ సిరీస్ వైపు నిత్యా అడుగులు..!

01 st Aug 2020, UTC
వెబ్ సిరీస్ వైపు నిత్యా అడుగులు..!

టాలీవుడ్ :  క్రమంగా వెండితెర భామలంతా ఓటిటి ల వైపు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నేపధ్యం లో థియేటర్లు లేకపోవడం తో ఓటిటిలు బాగా ఫేమస్ అయ్యాయి. ఇక వెబ్ సిరీస్ ల సంగతి ఐతే చెప్పక్కర్లేదు. సినిమా ల కంటే ఎక్కువ గా ఫేమస్ అయిపోతున్నాయి. ఫాల్లోవెర్లు పెరుగుతున్నారు. దీనితో టాలీవుడ్ భామలు కూడా ఓటిటి ల వైపు మొగ్గు చూపుతున్నారు.
           సినిమాల విడుదల కు అవకాశం లేకపోవడంతో నిర్మాతలు కూడా ఓటిటి ల పైనే ఆధారపడుతున్నారు. మంచి పేరు ప్రఖ్యాతలు వస్తుండడంతో పాత్ర బాగుంటే ఓటిటి లలో నటించడానికి కూడా హీరోయిన్ లు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే, సమంత కాజల్, శృతి హాసన్, తమన్నా వంటి తారలంతా ఓటిటి ల బాట పట్టారు. తాజాగా ఇదే బాటలో నిత్యా మీనన్ కూడా చేరింది. ఆమె కూడా ఓ ఓటిటి వెబ్ సిరీస్ కి కమిట్ అవబోతున్నారని సమాచారం.
          ఈ విషయమై నిత్యా మాట్లాడుతూ "డిజిటల్ నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయి. మంచి ఆఫర్ అయితే వెబ్ సీరీస్ చేయడానికి నాకు అభ్యంతరం లేదు. అయితే, ఒకటి  స్క్రిప్టు, నా పాత్ర నచ్చితేనే కమిట్ అవుతాను" అని ఇటీవల నిత్యా చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ లో దొరికిన ఖాళీ సమయాన్ని ఆమె సద్వినియోగం చేసుకున్నానని తెలిపారు. "కరోనా కారణంగా బయటికి ఎక్కడికీ వెళ్లలేదు. ఈ ఖాళీ సమయాన్ని నా గురించి నేను విశ్లేషించుకోవడానికి ఉపయోగించుకున్నాను. ఇంతవరకు ఏం చేశాను? ఇంకా ఏం చేయాలి? వంటి విషయాలను నాకు నేను ఎనలైజ్ చేసుకున్నాను" అని చెప్పుకొచ్చింది ఈ ఇష్క్ భామ. మరిన్ని వార్తలు చదవండి. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox