Breaking News

అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఎంపికైన నాని చిత్రం..!

31 st Jul 2020, UTC

టాలీవుడ్ : నాని "జెర్సీ" చిత్రానికి గొప్ప గుర్తింపు లభించింది. క్రికెట్ పట్ల ఓ ఆటగాడికి ఉన్న ఆసక్తిని హృద్యమైన రీతి లో భావోద్వేగభరితంగా చూపించిన చిత్రం 'జెర్సీ'. నాని హీరో గా నటించిన ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ గా నటించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం  గొప్ప విజయాన్ని సంపాదించింది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైంది. నాని నటనా ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన ఈ సినిమా ఇంటర్నేషనల్ ఇండియన్ టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైంది.  తొమ్మిది నుంచి పదిహేనవ తారీకు వరకు ఈ చిత్రోత్సవం జరగబోతోంది.  'జెర్సీ'  తో పాటుగా 'సూపర్ 30', కార్తీ నటించిన 'ఖైదీ' (తమిళ్) కూడా ఈ ఫెస్టివల్ కు ఎంపికైంది. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox