Breaking News

బాలయ్య అభిమానులకు ఒక రోజు ముందే బర్త్ డే ట్రీట్..!

09 th Jun 2020, UTC
బాలయ్య అభిమానులకు ఒక రోజు ముందే బర్త్ డే ట్రీట్..!

అభిమాన హీరో పుట్టినరోజు వస్తుందంటే అభిమానులకు పండుగ రోజే.తమ అభిమానులను ఆనందపరిచేందుకు  హీరోలు కూడా తమ పుట్టినరోజున ఏదో ఒక అప్‌డేట్ ఇస్తుంటారు. అయితే ఈసారి నందమూరి అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు నటసింహం  బాలయ్య రెడీ అవుతున్నారు. తన 60వ జన్మదినం సందర్భంగా ఒక అపురూపమైన పాటతో ప్రేక్షకాభిమానులను అలరించబోతున్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ. అలాగే ప్రస్తుతం బోయపాటితో చేస్తున్న సినిమాకు సంబంధించి కూడా ఓ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారట.

ఇక బర్త్‌డేకి ఒక రోజు ముందే అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు బాలయ్య రెడీ అవుతున్నారు. ఆయనే స్వయంగా పాడిన ఓ స్పెషల్ సాంగ్‌ను జూన్ 9 సాయంత్రం 5గంటల 03 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ సాంగ్ గురించి వార్తలు ప్రచారం అయిన విషయం తెలిసిందే.

బాలయ్య కూడా తన రీసెంట్ ఇంటర్వ్యూలలో త్వరలోనే అభిమానులకు ట్రీట్ ఉంటుంది అని చెప్పారు. చెప్పినట్లుగానే ఒక రోజు ముందే ఆ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ పాటను బాలయ్య తన ఎన్‌బికె ఫిల్మ్ యూట్యూబ్ చానెల్ ద్వారా విడుదల చేయనున్నారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox