Breaking News

షూటింగ్ మొదలు కాకుండానే దుమ్ముదులుపుతున్న "సర్కారు వారి పాట"..!

15 th Sep 2020, UTC
షూటింగ్ మొదలు కాకుండానే దుమ్ముదులుపుతున్న

టాలీవుడ్  :సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సినిమా కు ఆయన బ్రాండ్ వేల్యూ పెరుగుతూనే ఉంది. ఆయన కూడా మరీ ఎక్కువ ప్రయోగాల జోలికి పోకుండా సరికొత్త కధనం పై దృష్టి పెట్టి నష్టాలూ రాకుండా చూసుకుంటారు. కమర్షియల్ సినిమాలతో సేఫ్ జోన్ లో ఉండి మినిమం హిట్ కొట్టేయాలని భావిస్తున్నారు. తెలుగులోనే కాకుండా ఈ మిల్కీ బాయ్ కి ఇతర భాషల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నార్త్ ఇండియన్స్, తమిళియన్స్ లో కూడా మహేష్ కి మంచి క్రేజ్ ఉంది.

అందుకే మహేష్ సినిమా ల సాటిలైట్ హక్కులు కొనుగోలు చేయడానికి అక్కడి దర్శక నిర్మాతలు ఉవ్విళ్లూరుతుంటారు. అలా అప్పుడే  "సర్కారు వారి పాట" హవా మొదలైపోయింది. ఈ సినిమాకి ఇప్పటి వరకు షూటింగ్ ప్రారంభం కాలేదు. అసలు షూటింగ్ తాలూకు షెడ్యూల్ కూడా రాసుకోలేదు. అప్పుడే డిమాండ్ మొదలైపోయింది.. మరి సూపర్ స్టార్ నా, మజాకానా.

ఈ సినిమాకు గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్లనే ఈ సినిమా షూటింగ్ కూడా నిలిచిపోయింది. తిరిగి ఈ చిత్ర షూటింగ్ ను ప్రారంభించడానికి షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాకి అప్పుడే సూపర్ ఆఫర్ వచ్చిందట. సర్కారు వారి పాట శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కు 35 కోట్లకు డీల్ వచ్చిందట. అసలు సినిమా షూటింగ్ జరగకుండానే.ఈ రేంజ్ లో ఆఫర్ వచ్చిందంటే. గ్రేట్. అయితే, ఈ ఆఫర్ కి దర్శక నిర్మాతలు ఒప్పుకోలేదట. ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయని ఫిలిం వర్గాల టాక్. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox