Breaking News

ఇళయరాజాలాంటి వ్య‌క్తి ఇలా చేయడం బాధాకరం.. కాట్రగడ్డ ప్రసాద్

03 rd Aug 2020, UTC

చెన్నై : ఎల్వీ  ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్‌పై సంగీత దర్శకుడు ఇళయరాజా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సాయి, అతడి అనుచరులు ప్రసాద్ స్టూడియోలోని తన సూట్‌లోకి ప్రవేశించి సంగీత వాయిద్యాలతో పాటు ఇతర పరికరాలను ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. ఎల్వీ ప్ర‌సాద్ తనకు స్టూడియోలో ఇచ్చిన ప్ర‌త్యేక‌మైన గ‌ది ఉన్న స్టూడియో స్థలం గురించి వివాదం రాజుకున్న నేపథ్యంలో ఆయన ఈ ఫిర్యాదు చేశారు. అయితే, దీనిపై ప్రముఖ నిర్మాత, సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కాట్ర‌గ‌డ్డ ప్ర‌సాద్ స్పందిస్తూ, ఇళయరాజా తీరుపై మండిపడ్డారు.
 
ఎల్వీ ప్ర‌సాద్, ఆయ‌న కుటుంబం మూడు త‌రాలుగా సినీ ప‌రిశ్ర‌మ‌కు సేవ చేస్తోందని కాట్ర‌గ‌డ్డ ప్ర‌సాద్ అన్నారు. ఎల్వీ ప్ర‌సాద్ స్టూడియో కట్టారని, అప్పట్లో ఇళయరాజాకు డిమాండ్ ఉండటంతో ఆయన కోసం ప్రత్యేకంగా ఈ స్టూడియోలో ఓ గది, కపోజింగ్ రూమ్ ఇచ్చారు. అంతమాత్రాన దానితో ఇళయరాజా గారికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఇళయరాజా లాంటి ఓ లెజెండ్ ఆ రికార్డింగ్ థియేటర్ నాది అని కేసు పెట్టడం సరికాదు. ఇది అన్యాయం కూడా. ఆయ‌న ఎవ‌రి మాట విని చేస్తున్నారో తెలియ‌డం లేదు. కానీ ఆయ‌న‌లాంటి వ్య‌క్తి ఇలాంటి ప‌నులు చేయ‌డం బాధాక‌రం. 
 
ఆయన ఇన్‌వాయిస్‌ను చూపించి ఇళ‌య‌రాజా త‌న వాయిద్య ప‌రికరాల‌ను తీసుకెళ్లారని, మ‌ళ్లీ ఇప్పుడు కేసు పెట్టారని ఆయన మండిపడ్డారు. 
ఇళయరాజా వంటి వ్య‌క్తి ఇటువంటి ప‌నులు చేయ‌డం బాధాక‌రమని వ్యాఖ్యానించారు. ఇళయరాజా తన కేసును వెన‌క్కి తీసుకోవాలని ఆయన అన్నారు. మరిన్ని వార్తలు చదవండి. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox