Breaking News

గంగవ్వకు ఎంట్రీ టికెట్ ఇవ్వడం.. మిగతావాళ్ళకి అన్యాయమే కదా..!

15 th Sep 2020, UTC

బుల్లితెర :బిగ్  బాస్, టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో. ఇందులో గెలవాలంటే ఆడియన్స్ ఓట్లు తప్పనిసరి. ఎక్కువసార్లు ఆడియన్స్ తమకి ఎవరిపైన సింపతీ ఉంటుందో వారికే ఓట్లు వేస్తారు. ఈ నేపధ్యంలో బిగ్ బాస్ లో జరిగే ఎంపిక ఓ కంటెస్టెంట్ పైనే సింపతీ కలిగేలా ఉంటె, మిగిలిన వారికి అన్యాయమే జరుగుతుంది కదా. బిగ్ బాస్ నాలుగో షో పేలవంగా మొదలైంది. ఇందులో కంటెస్టెంట్ గా గంగవ్వను కూడా తీసుకొచ్చారు.

నిజానికి, ఈ షో వృద్ధుల కోసం తీసుకొచ్చింది కాదు. అందులోను గంగవ్వ లాంటి అచ్చ పల్లెటూరి పడచు లు బిగ్ బాస్ లాంటి ఆర్టిఫీషియల్ వాతావరణంలో ఇమడలేరు. దీనితో సహజంగా ఆడియన్స్ సింపతీ గంగవ్వ సొత్తే. ఇందులో గంగవ్వను విమర్శించడానికేమి లేదు. ఎంతో కష్టపడి పైకి వచ్చిన గంగవ్వ బిగ్ బాస్ లాంటి షో లో కూడా తన టాలెంట్ ను కష్టపడి ప్రూవ్ చేసుకుంటోంది. అయితే ఆమెకు ఆడియన్స్ సింపతీ కూడా ప్లస్ పాయింట్ అవుతుంది.

ఈ క్రమంలో ఎక్కువ శాతం ఓట్లు గంగవ్వకే చెల్లుతాయి. మొదటి వారం నామినేషన్ ఈ విషయం అర్ధం అయిపొయింది కదా. మిగిలిన ఓట్లను ఇతర కంటెస్టెంట్ లు పంచుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆటను ఆడగలిగే సత్తా ఉన్న కంటెస్టెంట్ లు కూడా షో చివరి దాకా ఉండకుండా వెళ్లిపోవాల్సి వస్తుంది. ప్రతివారం గంగవ్వను నామినేట్ చేసిన ఆడియన్స్ సింపతీ గంగవ్వకే ఉంటుంది. టిఆర్ పి ల కోసం ఆమెను హౌస్ లోకి పంపినా, మిగిలిన కంటెస్టెంట్స్ కి అన్యాయం జరుగుతుందని కొందరు తటస్థులు భావిస్తూనే ఉంటారు. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox