Breaking News

ఒకప్పటి సూపర్ ఫిలిం సీక్వెల్ తో దుల్ఖర్..!

03 rd Jun 2020, UTC

1992లో అరవింద్ స్వామి హీరో గా వెలుగులోకి వచ్చిన సినిమా "రోజా" గుర్తుందా...? వెండి తెరపై అప్పట్లోనే సరికొత్త ప్రేమ కథను ఆవిష్కరించిన సినిమా అది. ఈ చిత్రానికి సంగీత అందించిన రెహ్మాన్ కీ ఈ చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. మణిరత్నం దర్శకత్వ ప్రతిభను ఎక్కడికో తీసుకుపోయిన సినిమా 'రోజా'.
   అయితే.. ఈ చిత్రం సీక్వెల్ తీయబోతున్నారంటూ ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి... అవి నిజమా? అంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పుడీ వార్త నిజమయ్యే రోజు త్వరలోనే రానుంది. దర్శకుడు మణిరత్నం ఈ చిత్రం సీక్వెల్ ను చేయాలని నిర్ణయించుకుని, ఆ విధంగా స్క్రిప్టు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తాను చేస్తున్న'పొన్నియన్ సెల్వన్' చిత్రం పూర్తవగానే 'రోజూ 2'ని సెట్స్ కి తీసుకువెళతారని అంటున్నారు.
      ఇక ఈ సినిమా లో హీరో గా  మలయాళ యంగ్ హీరో దుల్ఖర్ సల్మాన్ ని ఎంచుకున్నట్టు సమాచారం. నాటి 'రోజా' హీరో అరవింద్ స్వామి అందానికి తగ్గా అందగాడు నేటి హీరోల్లో దుల్ఖర్ ఒక్కడే అన్నది మణిరత్నం భావిస్తున్నారేమో.... అందుకే అతనిని ఎంచుకున్నారేమో..!

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox