Breaking News

ఆలీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్..!

01 st Aug 2020, UTC
ఆలీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్..!

టాలీవుడ్ : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైరల్ అవుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో తాజాగా టాలీవుడ్ కమెడియన్ ఆలీ కూడా భాగస్వామ్యులయ్యారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్  ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆయన సారధ్యం లో పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఈ ఛాలెంజ్ లో భాగస్వామ్యం అవుతున్నారు.
        తాజాగా నేడు బక్రీద్ పర్వదినాన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన ఆలీ "గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని" అన్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను కమెడియన్ అలీ స్వీకరించి. మణికొండలోని తన ఇంటి పరిసర ప్రాంతాలలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఎంపి సంతోష్ కుమార్ మంచి  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఇది ఇలా ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా ఉందని ఆలీ చెప్పుకొచ్చారు. సోద‌రుడు, సినీ ఆర్టిస్ట్ ఖయుమ్, అలీ బావమరిది కరీంకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసిరారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox