Breaking News

బాలయ్యకు చిరు బర్త్ డే శుభాకాంక్షలు..!

10 th Jun 2020, UTC
బాలయ్యకు చిరు బర్త్ డే శుభాకాంక్షలు..!

 నేడు నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు మెగాస్టార్  చిరంజీవి ట్విటర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. బాలకృష్ణ ఇదే ఉత్సాహంతో ఆయురారోగ్యాలతో అందరి అభిమానం పొందాలని చిరంజీవి ఆకాంక్షించారు.

బాలకృష్ణకు కుటుంబ సభ్యులు, తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు శుభాంక్షాలు తెలుపుతున్నారు. ‘బాబాయ్‌ ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను’ అని జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

తండ్రి ఎన్టీఆర్‌ వారసత్వాన్ని బాలయ్య ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సీనియర్‌ నటుడు, ‘మా’ అధ్యక్షుడు నరేష్‌ శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా బీబీ3 (బాలకృష్ణ–బోయపాటి) ఫస్ట్‌ రోర్‌ పేరుతో విడుదల చేసిన లుక్‌, వీడియో అభిమానులను అలరిస్తోంది.

 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox