Breaking News

నేడు బిగ్ బీ అమితాబ్ మ్యారేజ్ డే..!

03 rd Jun 2020, UTC
నేడు బిగ్ బీ అమితాబ్ మ్యారేజ్ డే..!

బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ బుధవారం 47వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1973 జూన్‌ 3వ తేదీన కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అమితాబ్‌, జయ బచ్చన్‌ వివాహ బంధంతో ఒకటయ్యారు. . ఈ సందర్భంగా బీగ్‌బీ తన పెళ్లినాటి ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. అలాగే తన  సహ నటి జయ బచ్చన్‌ను  పెళ్లి చేసుకోవడానికి కారణమైన లండన్‌ పర్యటన గురించి ట్విటర్‌లో రాసుకొచ్చారు.

జూన్ 3, 1973.. 47 సంవత్సరాల క్రితం సరిగ్గా ఈ రోజు !!. 'జంజీర్' సినిమా భారీ విజయం సాధించడంతో వేడుకలు చేసుకునేందుకు జయ, కొద్దిమంది స్నేహితులతో లండన్‌ వెళ్లాలనుకున్నాం. ఈ విషయాన్ని ముందుగా నాన్న హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌కు చెప్పాను. ఎవరితో వెళుతున్నావని ఆయన అడిగారు. జయతో అని చెప్పినప్పడు.. నువ్వు ముందు ఆమెను పెళ్లి చేసుకో ఆ తరువాత లండన్‌ వెళ్లండి. లేకపోతే వెళ్లకండి అన్నారు. దానిని నేను అంగీకరించాను. జూన్‌3, 1973న ‌కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో జయను వివాహం చేసుకున్నాను. అనంతరం ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి లండన్‌కు బయలుదేరాం’. అంటూ నాటి జ్ఙాపకాలను గుర్తు చేసుకున్నారు.

 అమితాబ్ బచ్చన్, జయ  ఇద్దరు కలిసి తొలిసారిగా 1972 లో ‘బన్సీ బిర్జు’లో కలిసి పనిచేశారు. ఆ తర్వాత అభిమాన్‌, ఏక్‌ నజర్‌ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. వీరికి ఇద్దరు సతానం.అభిషేక్‌‌, శ్వేతా బచ్చన్‌. అభిషేక్ బచ్చన్..‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్‌ను 2007లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఆరాధ్య అనే కుమార్తె ఉంది. శ్వేతా బచ్చన్‌ పారిశ్రామికవేత్త నిఖిల్‌ నందను వివాహం చేసుకున్నారు. వీరికి నవ్య నవేలి, అగస్త్య ఇద్దరు పిల్లలు ఉన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox