Breaking News

బన్నీ తదుపరి సినిమా కొరటాల శివతో..!

15 th Jun 2020, UTC
 బన్నీ తదుపరి సినిమా కొరటాల శివతో..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే. సామజిక  సమస్యలను  కథలు గా రాసుకొని వాటిని కెమెరాలో బందించి ప్రాణం పోసే కొరటాల శివ డైరక్షన్ లో తన తదుపరి సినిమా చేయాలని బన్నీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఇద్దరి కాంబినేషన్లో  సినిమా రావాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక త్వరలోనే నెరవేరబోతోందని సమాచారం. అల్లు అర్జున్ కోసం కొరటాల శివ మంచి కధను రెడీ చేసారని, అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మాత్రం అతి త్వరలో ఈ క్రేజీ కాంబో మూవీ పట్టాలెక్కనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఈ మేరకు బ్యాక్‌గ్రౌండ్ వర్క్ జరుగుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్‌ని కొరటాల మీట్ కావడం, కథ వినిపించడం జరిగిందట. తన రెగ్యులర్ పంథాలోనే ఓ సామాజిక కథాంశాన్ని బన్నీ చెవిలో వేయగా.. ఆ కథ నచ్చడంతో వెంటనే బన్నీ ఓకే చెప్పేశారని అంటున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందించాలని, ఈ మేరకు ఇద్దరి మధ్య డీల్ కూడా కుదిరిందని టాక్.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' మూవీ చేస్తున్న అల్లు అర్జున్.. అది పూర్తికాగానే వెంటనే కొరటాలకు డేట్స్ ఇచ్చేశారట. మరోవైపు కొరటాల శివ సైతం చిరంజీవి హీరోగా తాను తెరకెక్కిస్తున్న 'ఆచార్య' పూర్తికాగానే అల్లు అర్జున్ మూవీ కోసం ప్రిపేర్ కానున్నారట. .. ఈ క్రేజీ కాంబోలో మూవీ అంటే  అంచనాలు కూడ అదే రేంజ్ లో వుంటాయి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox