Sonu Model Video Song Release: మాస్ కా దాస్, యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఫలితాల సంబంధంగా లేకుండా సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. ఈ ఏడాది గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీలతో అలరించారు. ఒకే ఏడాది మూడు సినిమాలు రిలీజ్ చేసి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇక ఇప్పుడు లైలా అనే సినిమా చేస్తున్నాడు. కొత్త డైరెక్టర్ రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ఫస్ట్‌లుక్, ప్రాచార పోస్టర్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఇందులో విశ్వక్ లేడీ గెటప్ కూడా వేయబోతుండటంతో లైలాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఈ చిత్రాన్ని ప్రకటించాడు. వచ్చే ఏడాది వాలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో మెల్లిమెల్లిగా మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా తాజాగా పాటను రిలీజ్ చేసింది మూవీ టీం.
సోనూ మోడల్ అంటూ సాగే ఈ పాటలో విశ్వక్ సూపర్ మోడల్‌లా కనిపించాడు. కొత్తగా ట్రెండీగా ఉన్న ఈ పాట లిరిక్స్ ఆడియన్స్ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ పాట రాసింది విశ్వక్ సేన్ కావడం విశేషం. విశ్వక్ సేన్ మొదటి సారి సాహిత్యం అందించిన ఈ పాటకు ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఈ పాట యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ అందుకుంది. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ పాటను నారాయణన్ రవిశంకర్, రేష్మా శ్యామ్‌లు ఆలపించారు.