టామ్ క్రూజ్ : 60 ఏళ్ల వయస్సులో కూడా తగ్గేదే లే అంటున్న “టామ్ క్రూజ్”… వైరల్‌గా మారిన యాక్షన్ సీక్వెన్స్ వీడియో !

  • Written By:
  • Publish Date - December 21, 2022 / 04:56 PM IST

Tom Cruise : హాలీవుడ్ ప్రముఖ నటుడు టామ్ క్రూజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. విభిన్న కథలను ఎంచుకుంటూ అభిమానుల్లో తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ హీరో. ముఖ్యంగా మిషన్ ఇంపాజిబుల్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులను పొందారు టామ్. ఇప్పటి వరకు ఈ సిరీస్ లో 6 సినిమాలు రాగా ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ 7 లో నటిస్తున్నాడు. తన సినిమాల్లో ఆయన చేసే యాక్షన్ సీన్లు గురించి చెప్పాలంటే మాటలు తక్కువే అనాలి. ఈ వయసులో కూడా ఆ రేంజ్ యాక్షన్ సీన్స్ లో నటిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు టామ్ క్రూజ్.

కాగా ఇటీవలే టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్ మావెరిక్ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే జోష్ లో మిషన్ ఇంపాజిబుల్ 7 ని రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్ లో ఆరు సినిమాలు రాగా త్వరలో 7,8 సినిమాలు రాబోతున్నాయి. మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమా షూట్ కూడా ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని 2023 జులై 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

అయితే క్రూజ్ తన సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు. చాలా వరకు డూప్ లేకుండానే టామ్ క్రూజ్ అన్ని యాక్షన్ సీన్స్ చేస్తాడు. ముఖ్యంగా మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో యాక్షన్ సీన్స్ ఒళ్ళు గగుర్పుడిచేలా ఉంటాయి. అలాంటి సన్నివేశాలని కూడా ఎంతో ఈజీగా చేస్తాడు టామ్ క్రూజ్. అయితే ఇప్పుడు చేస్తున్న మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమాలో ఓ రేంజ్ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ కి సంబంధించి ఒక వీడియో ని మూవీ టీమ్ పోస్ట్ చేసింది.

పారామౌంట్ పిక్చర్స్ యూట్యూబ్ అకౌంట్ లో ఈ వీడియో ని పోస్ట్ చేశారు. డైరెక్టర్ క్రిస్టోఫర్ మెక్ క్వారీ దగ్గరుండి మరీ ఈ యాక్షన్ సీన్స్ ని పర్యవేక్షిస్తున్నారు. మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమా కోసం 500 స్కై డైవ్స్, 13 వేల బైక్ జంప్స్ టామ్ క్రూజ్ చేశాడని క్వారీ తెలిపారు. వాటిలో ముఖ్యంగా హెలికాఫ్టర్ నుంచి దూకడం, బైక్ జంప్స్ విన్యాసాలు అదరగొట్టాయని చెప్పాలి. ఈ యాక్షన్ సీన్స్ చూసిన వాళ్ళంతా కూడా 60 ఏళ్ల వయసులో కూడా తగ్గేదె లే అంటూ ఈ తరహా యాక్షన్ సీన్స్ లో నటించడం పట్ల పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.