Site icon Prime9

2022 Top 10 Movies In Telugu: 2022 సూపర్ హిట్స్ మూవీస్ ఏంటి.. ఎంతెంత కలెక్ట్ చేశాయో తెలుసా..?

top 10 telugu movies in 2022

top 10 telugu movies in 2022

2022 Top 10 Movies In Telugu: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి సంవత్సరం వందల సినిమాలు విడుదలయ్యాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ సినిమాలో ఉత్తమ విభాగంలో షార్ట్‌లిస్ట్ అయ్యాయి. 2022 ఏడాదిలో టాలీవుడ్ అనేక విజయాలు నమోదు చేసింది. ఏ సంవత్సరమూ నమోదు చెయ్యనంతగా తెలుగు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టాయి. మరి ఈ సంవత్సరం బాక్సాఫీస్ వద్ద ది బెస్ట్ సినిమాలు ఏంటో చూసేద్దాం.

1.ఆర్ఆర్ఆర్: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా మల్టీస్టారర్ గా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. రాంచరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అనేక సంచలన రికార్డులను నమోదుచేసింది. 24 March 2022ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొత్తంగా RRR ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 1144 కోట్లు వసూలు చేసింది. మరియు భారతదేశంలో మొత్తం రూ. 902 కోట్లు వసూలు చేసింది. అంటే మొత్తం మీద సుమారు రూ. 2000వేల కోట్లు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఆస్కార్ బరిలోనూ తలపడుతుంది.

RRR

2.సీతారామం: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటింటి ఆల్ టైం క్లాసిక్ మూవీగా సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 4న విడుదలై ఘన విజయం సాధించింది. అద్భుతమైన ప్రేమకథా దృశ్యకావ్యంగా ఇటు చిత్రపరిశ్రమలోనూ అటు ఆడియన్స్ లోనూ మంచి పేరు తెచ్చుకుంది ఈ మూవీ. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా హిందీ వెర్షన్లోనూ తెరకెక్కింది. మొత్తంగా ఈ సినిమా సుమారు రూ. 100కోట్ల వసూళ్లు రాబట్టింది.

3.విక్రమ్: విశ్వనటుడు కమల్ హాసన్ కు చాలా కాలం తర్వాత మంచి కంబాక్ ఇచ్చిన సినిమా విక్రమ్. ఫహద్ ఫజిల్, విజయ్ సేతుపతి, లోకేష్ కంగరాజ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 326కోట్లు కలెక్ట్ చేసింది. 3 జూన్ 2022న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది.

4.పొన్నియన్ సెల్వన్-1: మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్-1. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష ప్రధాన పాత్రలో చారిత్రనేపథ్యంలో రూపొందించబడిన ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ. 482 కోట్లు కలెక్ట్ చేసింది.

5.కాంతార: హీరో రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో కేవలం 16కోట్లతో ఎటువంటి అంచనాలు లేకుండా కన్నడలో మాత్రమే రిలీజ్ అయిన కాంతార చిత్రం సూపర్ హిట్ అవడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేశారు. కాగా ఈ మూవీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆదివాసీల జీవనవిధానం, సంస్కృతీ సాంప్రదాయాలను కళ్లకట్టినట్టుగా చూపించిన తీరు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీనితో ఈ సినిమా సుమారు రూ. 400 కోట్లు కలెక్ట్ చేసింది.

kantara movie

6.కేజీఎఫ్ చాప్టర్-2: యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 13 ఏఫ్రిల్ 2022 పాన్ ఇండియా మూవీగా విడుదలైన కేజీఎఫ్ చాప్టర్-2 ప్రేక్షకులు ఊహించినట్టుగానే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ దేశవ్యాప్తంగా సుమారు రూ. 1200కోట్లను రాబట్టింది.

7. కార్తికేయ-2: నికిల్, అనుపమాపరమేశ్వర్ జంటగా శ్రీకృష్ణుని జన్మస్థలం మథుర నేపథ్యంలో తెరకెక్కిన మూవీ కార్తికేయ-2 ఈ ఏడాది బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ప్లేస్ సంపాదించుకుంది. 13 ఆగస్టు2022న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రూ. 15-30 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ సుమారు రూ. 121 కోట్లను కైవసం చేసుకుంది.

8. మేజర్: అడవి శేష్ హీరోగా ఆర్మీ అధికారి సందీప్ ఉన్నికృష్ణన్ రియల్ లైఫ్ ఆధారంగా రూపొందిచబడిన మూవీ మేజర్. ఈ సినిమా 3 జూన్ 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 65కోట్ల వసూళ్లను రాబట్టింది.

9. ఒకే ఒక జీవితం: శర్వానంద్ అమల తల్లీకొడుకులుగా నటించిన చిత్రం ఒకేఒక జీవితం. టైమ్ ట్రావెల్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది.

10.యశోద: సమంత ప్రధాన పాత్రలో లేడీ ఓరియంటెడ్ గా సరోగసీ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ యశోద. ఈ సినిమా 11నవంబర్ 2022 ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.

Exit mobile version