Site icon Prime9

Yash: అభిమానులతో 700 సెల్ఫీలు దిగిన హీరో ఎవరో తెలుసా..?

YASH

YASH

Yash: ’కెజిఎఫ్ ’ సిరీస్ తో కన్నడస్టార్ యశ్ ఎంత స్టార్ అయ్యాడో అందరికీ తెలిసిన విషయమే. యశ్ కెరీర్ ను కెజిఎఫ్ కు ముందు. తరువాతగా చెప్పుకోవచ్చు. కెజిఎఫ్ చిత్రాలముందే యశ్ కమర్షియల్ హీరోగా పేరుతెచ్చుకున్నా ఈ రెండు చిత్రాల తరువాత అతను పాన్ ఇండియా హీరో అయిపోయాడు. మరోవైపు ‘ కెజిఎఫ్ ‘ విడుదల తర్వాత, అతను ఏ ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు అతని తదుపరి చిత్రం కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ విషయంలో అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు.

ఇలా ఉండగా యశ్ తాజాగా కర్ణాటకలోని తన అభిమానులతో ఫోటో షూట్ ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి భారీగా జనం తరలివచ్చారు. యశ్ అభిమానులతో ఫోటోలు మరియు సెల్ఫీలు దిగారు. సుమారుగా 700 అభిమానులు వారి ఫోటోలను పోస్ట్ చేసి హృదయపూర్వక శుభాకాంక్షలు రాశారు. ’ఓహ్, మనిషి కల నిజమైంది, అతను ఎంత అద్భుతంగా ఉన్నాడు నేను యష్ #Yashrontosow‘ అని ఓ అభిమాని రాశాడు. అభిమానులంటే యశ్ కు ఎంతప్రేమో, అతను వారికి ఎంత ప్రయారిటీ ఇస్తాడనేది దీనితో తెలిసిందని వారంటున్నారు.

 

 

Exit mobile version